వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్య: పూజలు చేసుకోవడానికి ఓకే కానీ.. పేరు మాత్రం మాదే ఉండాలి: ముస్లిం వర్గాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అయోధ్యలో వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు 2.77 ఎకరాల భూమి ఆవరణలో రాముడి విగ్రహానికి హిందువులు పూజించుకునేందుకు తమకు సమ్మతమేనని ముస్లిం సంఘాలు సుప్రీంకోర్టులో తెలిపాయి. అయితే, హిందువులు పూజించుకునేందుకు ఒప్పుకున్నాం కానీ, ఆ భూమి వారికి చెందుతుందంటే మాత్రం అంగీకరించమని చెప్పాయి.

నేటి నుంచే జియో ఫైబర్ సేవలు: కనెక్షన్ తీసుకునే ముందు ఈ విషయాలు తెలుసుకోండినేటి నుంచే జియో ఫైబర్ సేవలు: కనెక్షన్ తీసుకునే ముందు ఈ విషయాలు తెలుసుకోండి

ముస్లిం సంఘాల తరపున న్యాయవాది రాజీవ్ ధావన్ వాదించారు. ఆ భూమిలో హిందువులు పూజించుకునేందుకు అంగీకారమే. కానీ, వక్ఫ్ బోర్డ్ పైనే వివాదాస్పద భూమి ఉండాలి. హిందువులు, ముస్లింలం కలిసే ఉంటాం. కానీ, అది మా ఆస్తి. ఇక్కడికి వచ్చి పూజలు చేసుకునేవారికి మాత్రం అనుమతిస్తాం అని న్యాయవాది ధావన్ వ్యాఖ్యానించారు.

Ayodhya: Muslim parties ready to coexist with Hindus

వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు బుధవారం నిర్మోహి అఖారా హక్కులపై వివరణ కోరింది. వివాదాస్పద రామజన్మభూమి బాబ్రీ మసీదు ఆవరణ నిర్మోహి అఖారా ఆధీనంలో ఉండగా.. దీనిని రామ్‌లల్లాకు ఇచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించింది. అయితే, ఈ ప్రాంతం వివాదాస్పదంగా ఉండటంతో దానిపై నిర్మోహి అఖారాకు హక్కులున్నాయా? లేవా? అనే అంశంపై అభిప్రాయాలు వ్యక్తం చేయాలని ఈ కేసులో వాదులుగా ఉన్న ముస్లిం మత సంఘాలను సుప్రీంకోర్టు సూచించింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. ప్రతివాదులుగా ఉన్న సున్నీ వక్ఫ్ బోర్డ్.. తొలుత వివాదాస్పద స్థలంపై కేసు వేశారు సిద్దిఖీ. నిర్మోహి అఖారాకు మాత్రమే రామజన్మభూమిలో పూజాది కార్యక్రమాలు నిర్వహించే హక్కు ఉన్నట్లు సిద్ధిఖీ ఒక ప్రటకలో వెల్లడించారు. అఖారాకు ఉన్న హక్కులను అంగీకరిస్తున్నారా? అన్నది స్పష్టం చేయాలని ముస్లిం సంఘాలను సుప్రీం సూచించింది.

English summary
Muslim parties created a flutter on Wednesday during the hearing of cross-appeals for ownership of disputed 2.77-acre Ram Janmabhoomi-Babri Masjid land in Ayodhya by telling the Supreme Court that if the title of the disputed land was vested in them, Hindus could be allowed to worship deity Ram Lalla in outer courtyard of the demolished mosque.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X