వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Ayodhya: నిన్న కరోనా పాజిటివ్ వచ్చిన 150 మంది పోలీసులే నేడు ప్రధాని మోడీకి సెక్యూరిటీ, ఓ లెక్కుంది

|
Google Oneindia TeluguNews

అయోధ్య/ లక్నో/ న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అయోధ్య సర్వాంగ సుందరంగా సిద్దం కావడంతో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్బంగా భారీ సంఖ్యలో బారికేడ్లు, పోలీసులు, సాయుధ బలగాలతో పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోడీ మూడు గంటలకు పైగా వివిద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ సమయంలో కరోనా వైరస్ (COVID 19) పాజిటివ్ వచ్చి వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్న 150 మంది పోలీసులు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్బంగా కట్టిదట్టమైన భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తారు. కరోనా పాజిటివ్ వచ్చి కోలుకున్న పోలీసులు ప్రధాని మోడీకి భద్రతా ఏర్పాట్లు చెయ్యడంలో పోలీసు అధికారులు ఓ లెక్కుంది, పక్కా స్కెచ్ ఉంది.

Coronavirus: సీఎంకు కరోనా, నేడు కూతురికి పాజిటివ్, కొడుకు క్వారంటైన్, బల్లాల్ క్లారిటీ !Coronavirus: సీఎంకు కరోనా, నేడు కూతురికి పాజిటివ్, కొడుకు క్వారంటైన్, బల్లాల్ క్లారిటీ !

 డీజీపీకి ఓ లెక్కుంది, దానికో స్కెచ్ ఉంది

డీజీపీకి ఓ లెక్కుంది, దానికో స్కెచ్ ఉంది

అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోడీ భద్రత కోసం ఏర్పాటు చేసిన 150 మంది పోలీసు అధికారులు, సిబ్బంది అందరూ ఇప్పటికే కరోనా వైరస్ (COVID 19) పాజిటివ్ రావడంతో వారు ఆసుపత్రిలో చికిత్స పొంది వ్యాధి పూర్తిగా నయం చేసుకున్నారు. కరోనా పాజిటివ్ వచ్చి కోలుకున్న పోలీసులు ప్రధాని నరేంద్ర మోడీకి భద్రతా ఏర్పాట్లలో పాల్లొనడంలో ఓ లెక్కుందని ఉత్తరప్రదేశ్ డీజీపీ అంటున్నారు.

 సాకేత్ విమానాశ్రయం

సాకేత్ విమానాశ్రయం

ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం (నేడు) ఉదయం 10. 30 గంటలకు ప్రత్యేక విమానంలో లక్నో చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో అయోధ్యకు చేరుకుంటారు. ఉదయం 11.30 గంటలకు హెలికాప్టర్ లో అయోధ్యలోని సాకేత్ విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోడీ

చేరుకుంటారు. సాకేత్ విమానాశ్రయంలో 150 మంది కరోనా వైరస్ తో కోలుకున్న పోలీసులు ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికి అక్కడి నుంచి ఆయన భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు.

 కరోనా పాజిటివ్ వచ్చిన పోలీసులే ఎందుకంటే ?

కరోనా పాజిటివ్ వచ్చిన పోలీసులే ఎందుకంటే ?

కరోనా వైరస్ పాజిటివ్ వచ్చి ఆ వ్యాధిని నయం చేసుకున్న పోలీసులనే ప్రధాని నరేంద్ర మోడీ భద్రతా ఏర్పాట్లకు నియమించడం వెనుక ఓ లెక్కుంది. కరోనా పాజిటివ్ వచ్చి వ్యాధి నయం చేసుకున్న పోలీసుల శరీరంలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుందని, వారికి రెండు మూడు నెలల పాటు మళ్లీ కరోనా వైరస్ వచ్చే చాన్స్ ఏమాత్రం లేదని, అందుకే ప్రధాని నరేంద్ర మోడీ భద్రత కోసం వారిని నియమించామని ఉత్తరప్రదేశ్ డీజీపీ అంటున్నారు.

 ప్రధాని మోడీ ఆరోగ్యం కాపాడటం కోసం

ప్రధాని మోడీ ఆరోగ్యం కాపాడటం కోసం

కరోనా వైరస్ వ్యాధిని నయం చేసుకున్న వారికి వచ్చే రెండు మూడు నెలల పాటు ఆ వైరస్ మళ్లీ వచ్చే అవకాశం ఉండదని, అందుకే వారిని భద్రతా ఏర్పాట్ల కోసం నియమించారని, ఈ లెక్కన ప్రధాని నరేంద్ర మోడీకి కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఏమాత్రం ఉండదని ఉత్తరప్రదేశ్ పోలీసు అధికారులు, వైద్యశాఖ అధికారులు ధీమాగా చెబుతున్నారు.

Recommended Video

Ram Mandir Bhoomi Pujan: Ayodhya's Grand Ram Temple Look Revealed!
 A to Z అదే పోలీసులు

A to Z అదే పోలీసులు

సాకేత్ విమానాశ్రయం నుంచి ప్రధాని నరేంద్ర మోడీ హనుమాన్ గర్హిలో ప్రత్యేక పూజలు చెయ్యనున్నారు. అక్కడి నుంచి రామ జన్మభూమిలోని రామ్ లాలా దర్శనం, రామ మందిరం ప్రతిపాదిత ఆలయంలో మొక్కలు నాటడం, రామమందిరం భూమి పూజ, తరువాత సమావేశం తదితర కార్యక్రమాలు పూర్తి అయ్యే వరకు ప్రధాని నరేంద్ర మోడీ వెంట కరోనా పాజిటివ్ వచ్చి వ్యాధి నయం చేసుకున్న 150 మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లలో నిమగ్నం అవుతారని ఉత్దరప్రదేశ్ డీజీపీ వివరించారు.

 సాకేత్ లో కరోనా తాండవం

సాకేత్ లో కరోనా తాండవం

ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్న సాకేత్ కాలనీలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ వ్యాధితో 16 మంది చనిపోయారు. సాకేత్ కాలనీలో ఇప్పటికే 604 కరోనా పాజిటివ్ ఆక్టీవ్ కేసులు ఉన్నాయి. కరోనా వైరస్ కేసులు ఎక్కువగా ఉన్న సాకేత్ కాలనీలో ప్రధాని నరేంద్ర మోడీ భద్రతా ఏర్పాట్లకు కరోనా పాజిటివ్ వచ్చి వ్యాధి నయం చేసుకున్న పోలీసులు ఉంటేనే ఎంతో మేలు అని ఈ నిర్ణయం తీసుకున్నామని ఉత్తరప్రదేశ్ డీజీపీ అంటున్నారు. మొత్తం మీద ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య పర్యటన సందర్బంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ఆ రాష్ట్ర పోలీసు అధికారులు అనేక కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

English summary
Ayodhya Ram Janmabhoomi: 150 Police, who recovered from Coronavirus will giving Security to Prime minister Narendra Modi in Ayodhya in Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X