వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్య రామాలయ స్థలంలో నదీ ప్రవాహం .. మోడల్‌ మార్చాల్సిందే.. ఐఐటీల సాయం కోరిన ట్రస్ట్

|
Google Oneindia TeluguNews

కోట్లాది మంది ప్రజలు చారిత్రక రామ మందిర నిర్మాణం కోసం నిరీక్షిస్తున్నారు. అంతేకాదు దేశవ్యాప్తంగా విరాళాలు సేకరిస్తూ అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. అయితే అయోధ్యలో రామమందిర నిర్మాణం ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. రామమందిర నిర్మాణానికి సంబంధించిన స్థలంలో నదీ ప్రవాహం దిగువన ఉన్నందున ఆలయ పునాదులు నిలబడటం లేదు. పిల్లర్ లు ధృఢంగా నిలబడని కారణంగా నిర్మాణం విషయంలో ఇబ్బంది కలుగుతుంది .

అయోధ్య రామాలయ రూపకర్తలు ఎవరో తెలుసా ? 15 తరాలుగా వారి ప్రస్థానం చాలా ఆసక్తికరం !!అయోధ్య రామాలయ రూపకర్తలు ఎవరో తెలుసా ? 15 తరాలుగా వారి ప్రస్థానం చాలా ఆసక్తికరం !!

రామ మందిర నిర్మాణ స్థలంలో ధృడంగా లేని భూమి , మెరుగైన నమూనాల కోసం నిపుణులతో సంప్రదింపులు

రామ మందిర నిర్మాణ స్థలంలో ధృడంగా లేని భూమి , మెరుగైన నమూనాల కోసం నిపుణులతో సంప్రదింపులు

రామ మందిర నిర్మాణ స్థలంలో నది ప్రవహిస్తున్న కారణంగా భూమి ధృడంగా లేదు ఈ సమస్యలు పరిష్కరిస్తేనే రామమందిర నిర్మాణం చేయడానికి వీలవుతుందని భావిస్తున్న రామ మందిర నిర్మాణ ట్రస్ట్ దేశంలోని ప్రముఖ ఐఐటీ నిపుణులతో , వివిధ ఇంజనీరింగ్ సంస్థలతో, నిర్మాణ రంగంలో పేరెన్నికగన్న సంస్థలతో సంప్రదిస్తుంది. సరయు నది ప్రవాహం దాని దిగువన ఉన్నందున ఆలయ పునాదికి మెరుగైన నమూనాలను సూచించాలని అయోధ్య రామమందిర నిర్మాణ ట్రస్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిపుణులను కోరినట్లుగా తెలుస్తుంది.

ఆలయం క్రింద సరయూ నదీ ప్రవాహం .. ప్రస్తుతం ఉన్న మోడల్ సాధ్యం కాదనిగుర్తించిన ట్రస్ట్

ఆలయం క్రింద సరయూ నదీ ప్రవాహం .. ప్రస్తుతం ఉన్న మోడల్ సాధ్యం కాదనిగుర్తించిన ట్రస్ట్

ఈ విషయంపై ప్రధాని మాజీ ప్రధాన కార్యదర్శి నృపేంద్ర మిశ్రా అధ్యక్షతన ఆలయ నిర్మాణ కమిటీ చర్చలు జరిపినట్లు వారు తెలిపారు. చర్చల సమయంలో, సరయు నది ప్రవాహం ఆలయం క్రింద ప్రవహిస్తున్నందున ఆలయ పునాది కోసం ప్రస్తుతం ఉన్న నమూనా సాధ్యం కాదని గ్రహించారు.

ఆలయం యొక్క బలమైన పునాది కోసం మెరుగైన నమూనాలను సూచించాలని ఐఐటిలను కోరినట్లుగా ‘శ్రీ రామ్ జనభూమి తీర్థ క్షేత్ర' ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. ఆలయ ట్రస్ట్ యొక్క నిర్మాణ కమిటీ రెండు ఎంపికలపై చర్చలు జరుపుతోంది.

 రామమందిర నిర్మాణం స్థలంలో 17 మీటర్ల లోతు వరకు గట్టి మట్టి లేదు

రామమందిర నిర్మాణం స్థలంలో 17 మీటర్ల లోతు వరకు గట్టి మట్టి లేదు

రామమందిర నిర్మాణం స్థలంలో 17 మీటర్ల లోతు వరకు గట్టి మట్టి లేదు . అక్కడ నదీ ప్రవాహం వల్ల భూమి చాలా మెతకగా ఉంది. అక్కడ ప్రవహిస్తున్న నీటిని ఏవిధంగా ఆపాలి? రామమందిర నిర్మాణానికి సంబంధించిన ఫౌండేషన్ గట్టిగా ఉండాలంటే ఏం చేయాలి వంటి అంశాలపై ట్రస్టు నిపుణులతో సమాలోచనలు జరుపుతోంది.

ఇప్పటికే రామమందిర నిర్మాణం కోసం టెస్ట్ పిల్లర్లను వేసి వాటిపై నిర్మాణం జరిపితే మందిరం ఏ విధంగా ఉంటుంది అన్నదానిపై ప్రయోగం చేశారు.

టెస్ట్ పిల్లర్లు వేసి పరిశీలిస్తే ప్రతికూలంగా ఫలితాలు

టెస్ట్ పిల్లర్లు వేసి పరిశీలిస్తే ప్రతికూలంగా ఫలితాలు

రామ్ మందిర్ ట్రస్ట్ సెక్రెటరీ చంపత్ రాయ్ చెప్పిన వివరాల ప్రకారం 125 అడుగుల లోతులో టెస్ట్ పిల్లర్లు పాతి వాటిపై ఏడు వందల టన్నుల బరువును ఉంచి అవి ఎంత వరకూ తట్టుకోగలుగుతుంది అనేది పరిశీలించారు. భూకంపాలను, ప్రకంపనలు తట్టుకొని అవి ఎంతవరకు నిలబడగలుగుతాయి అనేది పరిశీలించిన వారు అందుకు భిన్నంగా ఫలితాలు రావడంతో నిర్మాణంపై ఇప్పుడు నిపుణులను సంప్రదించే పనిలో పడ్డారు.

 ఐఐటీ నిపుణులను సంప్రదిస్తున్న ట్రస్ట్ .. నిర్మాణం జాప్యం అయ్యే ఛాన్స్

ఐఐటీ నిపుణులను సంప్రదిస్తున్న ట్రస్ట్ .. నిర్మాణం జాప్యం అయ్యే ఛాన్స్

చారిత్రక కట్టడం చెక్కుచెదరకుండా ఉండాలంటే మెరుగైన నమూనాలను సూచించాలని, దృఢమైన నిర్మాణానికి సలహాలు ఇవ్వాలని వారు ప్రముఖ ఐఐటీ నిపుణులను కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే రామమందిర నిర్మాణం ఆలస్యం అవుతుందేమో అన్న భావన కలుగుతుంది.
అయితే రామమందిర నిర్మాణం 2023 లో పూర్తి చెయ్యాలన్న సంకల్పంతో ఉంది రామ మందిర ట్రస్ట్ .

English summary
The Ram temple trust in Ayodhya has asked the Indian Institutes of Technology (IITs) to suggest better models for the foundation of the temple as a stream of the Sarayu river has been found below it, sources said on Tuesday. The construction committee of the temple, chaired by former principal secretary to the prime minister Nripendra Misra held deliberations over the matter here on Tuesday, they said. During the deliberations, it was realised that the existing model for the foundation of the temple was not feasible as a stream of the Sarayu river is flowing below the temple, a source said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X