వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్య రామ మందిర నిర్మాణంతో కరోనాకు అంతం: రామేశ్వర శర్మ

|
Google Oneindia TeluguNews

భోపాల్: అయోధ్యలో రామమందిర నిర్మాణంతో ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి అంతమవుతుందని మధ్యప్రదేశ్ ప్రొటెం స్పీకర్ రామేశ్వర్ శర్మవ్యాఖ్యానించారు. ఇప్పటికే మహమ్మారి బారిన మనదేశంలోని 12 లక్షల మంది పడిన విషయం తెలిసిందే.

రామ మందిర నిర్మాణంతో కరోనా అంతం..

రామ మందిర నిర్మాణంతో కరోనా అంతం..

శ్రీరాముడు గతంలో మానవుల సంక్షేమం కోసం రాక్షసులను వధించారు. ఇప్పుడు అయోధ్యలో రాముడి మందిరం నిర్మాణం మొదలవగానే.. కరోనా మహమ్మారి అంతం కూడా మొదలవుతుందని రామేశ్వర్ తెలిపారు. మనదేశమే కాదు, యావత్ ప్రపంచం కూడా కరోనా మహమ్మారితో బాధపడుతోంది. మనం సామాజిక దూరం పాటించడమే కాదు. మన పవిత్రమూర్తులను గుర్తు చేసుకుంటున్నాం. రామ మందిరం నిర్మించాలని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందని రామేశ్వర శర్మ తెలిపారు.

రామ మందిర భూమి పూజకు ప్రధాని నరేంద్ర మోడీ

రామ మందిర భూమి పూజకు ప్రధాని నరేంద్ర మోడీ

ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో అయోధ్యలో భూమి పూజ జరుగుతుందని రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆలయ నిర్మాణం కోసం ఈ ట్రస్ట్ ఏర్పడింది. భూమి పూజ కోసం ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించామని, ఆయన ఆగస్టు 5న వచ్చేందుకు అంగీకరించారని ట్రస్ట్ ట్రేజరర్ స్వామి గోవింద్ దేవ్ గిరి తెలిపారు. హనుమాన్ గర్హి,రామ్ లల్లా విగ్రహాలకు పూజలు చేసిన అనంతరం మధ్యాహ్నం ప్రధాని భూమిపూజలో పాల్గొంటారని తెలిపారు.

Recommended Video

Power Star Trailer ఫ్రీగా పవర్ స్టార్ | సినిమా కోసమే ట్రైలర్ లీక్ చేసాడా ? || Oneindia Telugu
కేవలం 150 మంది అతిథులకే ఆహ్వానం

కేవలం 150 మంది అతిథులకే ఆహ్వానం

భౌతిక దూరం నిబంధనల నేపథ్యంలో కేవలం 200 మంది అతిథులను మాత్రమే పిలుస్తున్నామని చెప్పారు. 150 మందిని ఆహ్వానించామని ఆయన తెలిపారు.ఆగస్టు 5న మధ్యాహ్నం 12.15 గంటల 32 సెకన్లకు గోవింద్ గిరి ముహూర్తం పెట్టారని తెలిపారు. కాగా, దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 12 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

English summary
The construction of the Ram temple in Ayodhya will bring an end to the coronavirus pandemic, which has infected over 12 lakh across the country so far, Madhya Pradesh Assembly Protem Speaker Rameshwar Sharma said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X