• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

యూపీ ఎన్నికల తర్వాతే మందిరం -2023 డిసెంబ‌ర్ నుంచి భ‌క్తుల‌కు అయోధ్య రాముడి ద‌ర్శ‌నం

|

దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తోన్న అద్భుత ఘట్టానికి ముహుర్తం దాదాపు ఖరారైంది. తన జన్మభూమి నుంచే శ్రీరాముడు జనానికి దర్శనమిచ్చే సమయం ఇంకెంత దూరంలోనూ లేదు.. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ప్రధాని నరేంద్ర మోదీ శిలాన్యాస్ చేసి నేటి(ఆగస్టు 5)కి ఏడాది పూర్తవుతోన్న సందర్భంగా రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక విషయాన్ని వెల్లడించింది. భూమి పూజ చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహించేందుకు ట్రస్ట్ సిద్దమవుతోంది.

ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య‌ పట్టణంలో 70 ఎక‌రాల సుదీర్ఘ విస్తీర్ణంలో నిర్మిస్తున్న రామ‌మందిరం 2025 చివ‌రిక‌ల్లా పూర్త‌వుతుంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. అయితే అంత‌కు రెండేండ్లు ముందుగా అంటే 2023, డిసెంబ‌ర్ నాటికి గ‌ర్భ‌గుడి నిర్మాణం పూర్త‌వుతుంద‌ని, గ‌ర్భ‌గుడి నిర్మాణం పూర్త‌యిన వెంట‌నే భ‌క్తుల‌కు ప్ర‌వేశం క‌ల్పిస్తార‌ని అయోధ్య రామాల‌య వ‌ర్గాలు వెల్ల‌డించాయి. అంటే ఆల‌య వ‌ర్గాలు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. భ‌క్తులు 2023 డిసెంబ‌ర్ నుంచి అయోధ్య‌లో పూజ‌లు చేయ‌వ‌చ్చ‌న్న‌మాట‌.

ayodhya-s-ram-temple-to-open-for-devotees-by-december-2023-says-srjtk

రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఛైర్మ‌న్ నృపేంద్ర మిశ్రా అధ్య‌క్ష‌త‌న జరిగిన సమావేశంలో ఈ మేర‌కు నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది. అయోధ్య‌లో రామాల‌యం నిర్మాణం కోసం ప్ర‌ధాని మోదీ గ‌త ఏడాది ఆగ‌స్టు 5న పునాది రాయి వేశారు. అయితే భారీగా వ‌ర‌ద‌నీరు నిలువ‌డంతో ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ప‌నుల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. ప్ర‌స్తుతం ఆల‌య పునాది నిర్మాణం జ‌రుగుతున్న‌ది. వ‌చ్చే నెల 15 క‌ల్లా పునాది నిర్మాణం పూర్త‌వుతుంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు.

అయోధ్యలో ఆలయంతో పాటు మ్యూజియం, డిజిటల్ ఆర్కైవ్‌లు, పరిశోధనా కేంద్రం కూడా నిర్మితమవుతోంది. దీనితో పాటు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రామ్ భక్తులకు పెద్ద ఆఫర్ ప్రకటించింది. రామ భక్తులందరూ ఇప్పుడు రామ మందిర నిర్మాణ పనులను అక్కడికి వెళ్లి చూడవచ్చు. దీని కోసం ఒక వ్యూపాయింట్ నిర్మించబడుతుంది. అయోధ్యకు వచ్చే భక్తులు ఆలయ నిర్మాణ పనులను తమ కళ్లతో చూడగలుగుతారు.

దీనిని గతంలో టెంట్‌లో కూర్చొని ఉన్న రామ్ లల్లాను దర్శించుకుని వచ్చేవారు. ఇప్పుడు ఆ ప్రాంతం పూర్తి స్థాయిలో దేవాలయంగా మార్చేసింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. ఇప్పుడు రామ్ లల్లా భక్తులకు దర్శన దూరం కూడా తగ్గించబడింది. ఆలయ నిర్మాణానికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తరపున దేశవ్యాప్తంగా విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో రామ మందిర నిర్మాణ కమిటీ నిర్మాణ పనులలో పూర్తిగా నిమగ్నమై ఉంది. కాగా,

పులివెందుల కోర్టు: జగన్ బాబాయి హత్య: సునీల్ యాదవ్‌కు 14రోజుల రిమాండ్, కడప జైలుకు తరలించిన సీబీఐపులివెందుల కోర్టు: జగన్ బాబాయి హత్య: సునీల్ యాదవ్‌కు 14రోజుల రిమాండ్, కడప జైలుకు తరలించిన సీబీఐ

  Ayodhya Lord Ram Temple construction: BJP Leader Babu Mohan collecting Donations | Oneindia Telugu

  ఉత్తరప్రదేశ్ లో ఇంకొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అయోధ్య ఆలయానికి సంబంధించిన వ్యవహారాలు కీలకంగా మారాయి. రాబోయే ఎన్నికల్లో బీజేపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్య నుంచే పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లోగా మందిరాన్ని పూర్తి చేయిస్తామని గతంలో బీజేపీ నేతలు చెప్పడం తెలిసిందే.

  English summary
  One year after PM Modi kick-started the construction of the Ram temple in Ayodhya, progress has been slow and replete with technical and logistical constraints. However, top sources in the Shri Ram Janmbhoomi Teerth Kshetra say that the temple would be partly ready by late 2023. This is also when "darshan" for devotees is expected to begin. The assessment, for now, is that the temple will be completed by 2025.This means that by the end of 2023, the sanctum sanctorum of the temple will be ready to receive devotees.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X