వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Ayodhya: సుబ్రమణ్యస్వామి తాజా పిటిషన్ విచారణకు ‘నో’ చెప్పిన సుప్రీం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అయోధ్య కేసులో భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రమణ్యస్వామి వేసిన తాజా పిటిషన్‌ను విచారించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయోధ్యకేసు తుది వాదనలు బుధవారం సాయంత్రం 5గంటల లోపు ముగుస్తాయని ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే సుబ్రమణ్యస్వామి వేసిన పిటిషన్‌ను విచారించబోమని సుప్రంకోర్టు స్పష్టం చేసింది. ఇది ఇలా ఉంటే, సుప్రీంకోర్టు తీర్పు వెల్లడికి కొద్ది గంటల ముందే సున్నీ వక్ఫ్ బోర్డ్ కేసు నుంచి తమ పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు సిద్దమైంది. హిందువులు, ముస్లిం వర్గాలకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ప్యానెల్ ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపింది.

పిటిషనర్ ఉపసంహరణకు వక్ఫ్ బోర్డ్ ఇచ్చిన వినతిపత్రాన్ని బుధవారం సుప్రీంకోర్టు కోర్టుకు అందజేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సున్నీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ జాఫర్ అహ్మద్ ఫరూఖీ ఆ వినతి పత్రాన్ని ప్యానెల్ కు అందజేశారు.అయోధ్య-బాబ్రీ మసీదు కేసులో ప్రధాన కక్షిదారుగా ఉన్న వక్ఫ్ బర్డు కేసును ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంది.

Ayodhya : SC refuses to take up Subramanian Swamys fresh petition

వక్ఫ్ బోర్డ సభ్యుల మద్య బేధాప్రాయాలు, ఫారూఖిపై ఎఫ్ఐఆర్ లు నమోదుకావడంతో పిటిషన్ ఉపసంహరించుకునేందుకు సిద్దపడింది. కాగా, వక్ఫ్ బోర్డ్ భూముల్లో జరిగిన అవకతవకలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా సీబీఐ విచారణను కోరింది. మరో వైపు వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ ఫారుఖి తమ తరపు న్యాయవాదిని మార్చేందుకు ప్రయత్నించారు. ఇందుకోసం ప్యానెల్‌కి లేఖ కూడా రాశారు. కాగా, ఫారూఖీ అక్రమాలకు పాల్పడ్డాడు కాబట్టే.. కేసు ఉపసంహరించుకుంటున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి.

ఇది ఇలావుంటే, సోమవారం ఉదయం నుంచి ఇరుపక్షాలు సుప్రీంకోర్టు ధర్మాసనానికి తమ వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంోల హిందూ మహాసభ తరపున వాదిస్తున్న న్యాయవాది 'అయోధ్య రీవిజిటెడ్' అనే పుస్తకాన్ని న్యాయమూర్తికి చూపించారు. అయోధ్య రాముడు పుట్టిన నేల అని చెప్పడానికి ఇదే సాక్ష్యం అని అన్నారు. అయితే, సదరు న్యాయమూర్తి వాదనలతో ముస్లిం సంస్థల తరపు న్యాయవాది రాజీవ్ ధావన్ ఏకీభవించలేదు. దీంతో కోర్టులో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

ఇదే క్రమంలో రాజీవ్ ధావన్ ఆ పుస్తకాన్ని చించివేయడం కొంత ఆందోళన పరిస్థితికి దారితీసింది. దీంతో న్యాయవాదుల తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది. ఇలా ప్రవర్తిస్తే తాము వెళ్లిపోతామని న్యాయమూర్తులు హెచ్చరించారు. అయోధ్యలో ముస్లింలు ప్రార్థన చేసుకోవడానికి 50-60 మసీదులు ఉన్నాయని, కానీ, హిందువులకు రాముడి జన్మ స్థలమైన మందిరం ఒక్కటే ఉందన్నారు. ఇప్పటివరకు జరిగిందేదో జరిగింది.. ఈ సాయంత్రం తుది తీర్పు వెల్లడిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

English summary
The Supreme Court has decided not to hear the petition filed BJP Rajya Sabha MP Subramanian Swamy in Ayodhya case. CJI Ranjan Gogoi has already made it clear that arguments in the decades-old case will conclude by 5 PM today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X