వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీసాలు లేకుండా అయోధ్యలో రాముడి విగ్రహమా?: హిందూ నేత శంభాజీ

|
Google Oneindia TeluguNews

లక్నో: అయోధ్యలో నిర్మించే రామ మందిరంలో ఏర్పాటు చేసే శ్రీరాముడి విగ్రహానికి మీసం ఉండాలని హిందుత్వ నాయకుడు శంభాజీ భిడే సోమవారం వ్యాఖ్యానించారు. ఆగస్టు 5న అయోధ్యలోని రామ జన్మభూమిలో రామ మందిర భూమి పూజ జరగనున్న విషయం తెలిసిందే. ఈ కార్య్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతోపాటు పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు.

ఈ సందర్భంగా శంభాజీ బిడే మీడియాతో మాట్లాడుతూ.. రామ మందిరంలో ఏర్పాటు చేసే శ్రీరాముడు, లక్ష్మణుల విగ్రహాలకు మీసాలు ఉండాలని, ఈ మేరు టెంపుల్ ట్రస్టీ గోవింద్ గిరీజీ మహారాజ్‌కు విన్నవించినట్లు తెలిపారు.

 Ayodhya Temple with Sri Ram, Laxman Idols Sans Moustaches of No Use to Devotees Like Me: Sambhaji Bhide

శ్రీరాముడి విగ్రహానికి మీసాలు లేకుండా ఏర్పాటు చేస్తే తన లాంటి భక్తులకు రామ మందిరం కట్టినా ఎలాంటి ఉపయోగం ఉండదని శంభాజీ వ్యాఖ్యానించారు. భూమి పూజకు ముందు ఛత్రపతి శివాజీ మహరాజ్ చిత్రపటానికి పూజలు చేయాలని ఆయన కోరారు. భూమి పూజ సందర్భంగా దేశ ప్రజలు దీపావళి, దసరా పండగలా వేడుకలో చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Recommended Video

Ayodhya Ram Temple Groundbreaking : అమెరికాలోని ప్రఖ్యాత Times Square లో 3D లో రామాలయ నమూనా!

కొందరు ప్రజలు రాముడి మందిర నిర్మాణం కరోనాను అంతం చేస్తుందని చెప్పుకుంటున్నారంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలను శంభాజీ తప్పుబట్టారు. అలాంటి వ్యాఖ్యలు ఆయన చేయడం సరికాదన్నారు. భూమి పూజ కార్యక్రమానికి శరద్ పవార్ ఆహ్వానించకపోయినప్పటికీ మహారాష్ట్ర తరపున హాజరుకావాలని ఆయన వ్యాఖ్యానించారు.

English summary
Hindutva leader Sambhaji Bhide on Monday said the idol of Lord Ram in the proposed temple at Ayodhya should have a moustache.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X