తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుపతి తీరుగా అయోధ్య... రెండున్నరేళ్లలో పూర్తి

|
Google Oneindia TeluguNews

అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించడంతో... అయోధ్యను ఒక ప్రముఖనగరంగా తీర్చి దిద్దేందుకు అక్కడి అధికారలు అప్పుడే శ్రీకారం చుట్టారు. దీంతో దేశంలో ప్రాశస్య్తం పొందిన తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అయోధ్యను అభివృద్ది చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ప్రణాళికలు కూడ సిద్దం చేసినట్టు సమాచారం. అయితే అయోధ్య తిరుమల తిరుపతి తరహాలో అభివృద్ది చెందేందుకు సుమారు నాలుగు సంవత్సరాలు పడుతుందని అధికారులు వివరిస్తున్నారు.

అయోధ్య రామమందిరం: ఆలయం నిర్మాణం కోసం ట్రస్టు ఏర్పాటకు హోంశాఖ కసరత్తుఅయోధ్య రామమందిరం: ఆలయం నిర్మాణం కోసం ట్రస్టు ఏర్పాటకు హోంశాఖ కసరత్తు

 తిరుపతి వలే అయోధ్య

తిరుపతి వలే అయోధ్య

భారత్‌లోని హిందువుల దశాబ్దాల కళ త్వరలో నెరవేరబోతుంది. రామ మందిరం నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోవడంతో అయోధ్య నిర్మాణం, దాని అభివృద్దిపై అధికారులు దృష్టి సారించారు. ఇప్పటి వరకు మాములు నగరంగా ఉన్న అయోధ్యకు ఇటివలే ప్రత్యేక జిల్లాగా కూడ తీసుకువచ్చారు. ఇక రామాలయం నిర్మించే అయోధ్యకు పూర్తి అభివృద్ది రేఖలు తీసుకువచ్చేందుకు అక్కడి అధికారులు సన్నద్దమయ్యారు. భక్తులకు కావాల్సిన సౌకర్యాలతో దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపోందించారు. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం వలే ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.

భక్తులకు సకల సౌకర్యాలు...

భక్తులకు సకల సౌకర్యాలు...

ఇందులో భాగంగానే అయోధ్యకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఫైవ్ స్టార్ హోటళ్లు, రిసార్టులు, అంతర్జాతీయ విమానాశ్రాయాలు, ఇతర ప్రయాణ సౌకర్యాలను ఏర్పాటు చేయడంతో పాటు నగరానికి అనుకుని ఉన్న సరయూ నదిలో విహారం కోసం ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. అభివృద్ది పనులను పర్వవేక్షించేందు ప్రత్యేకంగా అయోధ్య తీర్థ వికాస్ అనే పరిషత్‌ను కూడ ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది. ముఖ్యంగా వచ్చే శ్రీరామ నవమి వరకు ఆలయా పరిసరాలను ప్రాధమిక రూపానికి తీసుకురావాలని నిర్ణయించారు. దీంతో అంతర్జాతీయ విమానాల రాకపోకలను వచ్చే శ్రీరామ నవమి నుండే ప్రారంభించాలని నిర్ణయించారు.

రెండున్నర సంవత్సరాల్లో మందిర నిర్మాణం

రెండున్నర సంవత్సరాల్లో మందిర నిర్మాణం

మొత్తం మీద అయోధ్యను దేశంలోనే అతిపెద్ద మతపరమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఇందుకోసం 77 ఎకరాల పరిధిలో పలు మతపరమైన భవనాలను నిర్మించనున్నట్టు తెలుస్తోంది. కాగా ఇప్పటికే సగానికి పైగా ఆలయ శిల్పాల పనులు పూర్తయ్యాయి. ఇక మిగిలిన పనుల ను త్వరితగతిన పూర్తి చేసేందుకు సుమారు రెండు వేల మంది శిల్పులతో ప్రతిరోజు పనులను చేసి మరో రెండున్నరేళ్లలో ఆలయాన్ని నిర్మించనున్నారు. ఇక అభివృద్ది ప్రణాళికలో భాగంగా ఎలాంటీ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా 5 కిలోమీటర్ల పోడవైన ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నట్టు అయోధ్య అభివృద్ది అధికారులు తెలిపారు.

English summary
Authorities are gearing up to give Ayodhya a complete makeover following the Supreme Court verdict in favour of a Ram temple,like tirupati temple
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X