వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్య తీర్పు దేశవ్యాప్త అలర్ట్ ...యూపికి అదనపు బలగాలు

|
Google Oneindia TeluguNews

నవంబర్ 18లోపు అయోధ్య స్థల వివాదంపై తీర్పు వెలువడనున్న నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సున్నిత ప్రాంతాలను గుర్తించిన పోలీసులు హిందూ, ముస్లిం వర్గాలకు చెందిన నేతలతో సమావేశాలు ఏర్పాటు చేశారు. తీర్పు వెలువడనున్న నేపథ్యంలోనే ఎక్కడ ఎలాంటీ అవాంచనీయ సంఘటనలు జరగుకుండా పలు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా యూపీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే రాష్ట్ర బలగాలు మోహరించిన నేపథ్యంలోనే మరో నాలుగువేల మంది అదనపు కేంద్ర పోలీసు బలగాలను యూపీకి పంపనుంది.

 దేశవ్యాప్తంగా పోలీసుల అలర్ట్

దేశవ్యాప్తంగా పోలీసుల అలర్ట్


భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ అయోధ్య స్థల వివాదంపై తీర్పును వెలువరించనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అయోధ్య తీర్పును రంజన్ గోగొయ్ పదవి వివరణ చేస్తున్న నవంబర్ 18వ తేదీ నాటికి అయోధ్య కేసుతో పలు కీలక కేసుల్లో తీర్పును వెలువరించనున్నట్టు ప్రకటించారు. దీంతో కీలకమైన అయోధ్య వివాదంపై ఎలాంటీ తీర్పు వెలువడినా... ప్రజల్లో అందోళనలు చెలరేగకుండా చర్యలు చేపట్టారు. ఇప్పటికే రాజకీయపరంగా పలు చర్యలు తీసుకున్నారు.. మతాల మధ్య ఘర్షణలు తలెత్తకుండా ఇరువర్గాలను సమావేశపరిచి పరిస్థితిని వివరిస్తున్నారు. ఎలాంటీ తీర్పు ఉన్న స్వాగతించే విధంగా అవగాహాన కల్పిస్తున్నారు.

 యూపీ కీలకం

యూపీ కీలకం

అయోధ్య తీర్పు వెలువడనున్న సంధర్భంలో యూపీ కీలకంగా మారింది. ప్రస్తుతం యూపీలో ముఖ్యమంత్రి యోగి అధిత్యానాథ్ పలు హెచ్చరికలు జారీ చేశారు. ఎవ్వరు కూడ రాజకీయంగా అయోధ్య తీర్పుపై ప్రసంగాలు చేయకూడదని పార్టీ నాయకులకు ఆంక్షలు విధించారు. దీంతో భద్రతపరంగా కూడ చర్యలు చేపట్టారు. ఇందుకోసం సమస్యత్మక ప్రాంతాల్లో భారిగా పోలీసులను మోహరించారు. మరోవైపు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడ చర్యలు చేపట్టింది. యూపీకి 15 కంపనీల సాయుధ పోలీసులను పంపాలని నిర్ణయించారు. నబంబర్ 11వ తేదిన పోలీసులు రాష్ట్రానికి వెళ్లనున్నట్టు వెల్లడించారు. అయితే కొద్ది రోజులు మాత్రమే రాష్ట్రంలో మాకం వేసేందుకు నిర్ణయించారు. దీంతో రంజన్ గగోయ్ పదవి విరమణ చేసే తేదివరకు బలగాలను కొనసాగించనున్నట్టు తెలుస్తోంది.

సుధీర్ఘంగా వివాదంపై వాదనలు

సుధీర్ఘంగా వివాదంపై వాదనలు


అయోధ్య వివాదంపై ప్రధాన న్యాయమూర్తి రంజన్‌గోగొయ్ సుదీర్ఘంగా వాదనలు విన్నారు. సుమారు నలబై రోజుల పాటు రంజన్‌ గోగొయ్‌తో కూడిన అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కేసు విచారణ చెపట్టింది. అయితే అంతకు ముందు అయోధ్య పరిష్కారం కోసం మధ్యవర్తుల కమిటిని కూడ కోర్టు నియమించింది. కాని వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడడంలో వైఫల్యం చెందింది. దీంతో తిరిగి ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. కొద్ది రోజుల్లో దశాబ్దాలుగా హిందూ, ముస్లింల మధ్య సున్నిత అంశంగా ఉన్న వివాదానికి ఫుల్‌స్టాప్ పడనుండడంతో దేశ వ్యాప్తంగా భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఇక డిశంబర్ ఆరున బాబ్రీ సంఘటన కూల్చివేతకు కొద్ది రోజుల ముందుగానే తీర్పు వెలువడుతుందని అదే రోజు తిరిగి రామాలయం నిర్మిస్తామని పలు హిందూ ధర్మ సంస్థలు కూడ ఇప్పటికే ప్రకటించాయి.

English summary
central police force have been deployed all over india In the wake of the verdict on the Ayodhya land dispute within few days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X