వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Ayodhya Verdict:కాలక్రమంలో అయోధ్య ,నాటి నుంచి నేటి వరకు (ఫోటోలు)

|
Google Oneindia TeluguNews

కొన్నేళ్లుగా నలిగిన వివాదం. కోర్టుల చుట్టూ నడిచిన వ్యవహారం. ఎట్టకేలకు అయోధ్య రామమందిరం బాబ్రీ మసీదు భూవివాదంపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. అయోధ్యలో వివాదంగా మారిన 2.77 ఎకరాల స్థలం రామ్‌లల్లా విరాజ్‌మాన్‌కే చెందుతుందంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. అదే సమయంలో మసీదు నిర్మాణంకు ఐదెకరాల స్థలం కేటాయించాలంటూ న్యాయస్థానం ప్రభుత్వానికి సూచించింది. వివాదాల సుడిగుండంలో నలిగిన అయోధ్యకు సంబంధించి అలనాటి ఫోటోలు మీకోసం

1. 1992లో అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత తీసిన ఫోటో. ఇక్కడ ఓ జవాను తన విధులు నిర్వర్తిస్తున్నాడు. బాబ్రీ మసీదు కూల్చి వేత తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో నాడు ప్రభుత్వం గట్టి భద్రతా చర్యలు చేపట్టింది.

Ayodhya verdict:Here is Ayodhya over the years(Photos)

2. 2010లో ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి శుక్రవారం రోజున నమాజ్ చేసుకుని వస్తుండగా మరో పూజారి పక్కనే వస్తుండగా తీసిన ఫోటో. ఈ ఫోటోను చూస్తే రెండు వర్గాల ప్రజలు అప్పుడే సోదరభావంతో మెలిగారనేది స్పష్టమవుతోంది.

Ayodhya verdict:Here is Ayodhya over the years(Photos)

3. వివాదాస్ప రామజన్మభూమి-బాబ్రీ మసీదు ప్రాంతంలో భారత పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడ్డ స్తంభాలు. ఈ రుజువులనే సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా హిందూ సంఘాలు ముందుంచాయి. ఈ స్తంభాలకు ఇస్లాం కట్టడాలకు పొంతన లేదని హిందూ సంఘాలు వాదించాయి.

Ayodhya verdict:Here is Ayodhya over the years(Photos)

4. 2013లో అయోధ్యలో విధులు నిర్వర్తించి అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న పోలీసులు.

Ayodhya verdict:Here is Ayodhya over the years(Photos)

5. 2017లో దీపావళి సందర్భంగా అయోధ్యలోని రాంపడిలో దీపాలు వెలిగిస్తున్న పోలీసులు.

Ayodhya verdict:Here is Ayodhya over the years(Photos)

6. 2018లో ఇరువర్గాల వారు వాదనల సందర్భంగా సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. అయితే కేసు వాయిదా పడటంతో బయటకు వచ్చి ఒకరితో ఒకరు చర్చించుకుంటున్న దృశ్యాలు.

Ayodhya verdict:Here is Ayodhya over the years(Photos)

7. 2018లో హిందూ సంఘాల సదస్సు సందర్భంగా అయోధ్యలో గట్టి బందోబస్తును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పారామిలటరీ బలగాలను మోహరించిన ప్రభుత్వం

Ayodhya verdict:Here is Ayodhya over the years(Photos)

English summary
With Supreme court delivering the verdict in favour of Ramtemple in Ayodhya case, lets take a look back at Ayodhya over the years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X