వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్య తీర్పుకు ముందే మృతి చెందిన రామమందిరం ప్రముఖ శిల్పి, చివరి కోరిక!

|
Google Oneindia TeluguNews

లక్నో: ప్రాణాలు పోయే వరకు తాను రామమందిరం కోసం రాతి శిల్పాలు చెక్కుతానని, ప్రాణం పోయేలోపు రామమందిరం నిర్మాణం కళ్లారా చూస్తానని ఎదురు చూసిన ప్రముఖ శిల్పి అయోధ్య తీర్పు రాకముందే ప్రాణాలు విడిచారు. జీవిత ఆశయం పూర్తి కాకముందే, చివరి కోరిక తీరకముందే పైలోకాలకు వెళ్లిపోయిన ప్రముఖ శిల్పి పేరు చంద్రకాంత్ భాయ్ సోమ్ పుర. గుజరాత్ లోని ప్రముఖ సోమనాథ్ మందిరం ప్రముఖ శిల్పి కుమారుడే ఈ చంద్రకాంత్ భాయ్ సోమ్ పుర. రామమందిరం నిర్మాణం కోసం 1990 నుంచి నిరంతరంగా ఇటీవల వరకూ చంద్రకాంత్ భాయ్ సోమ్ పూర్ రాతి శిల్పాలు చెక్కారు.

అయోధ్య తీర్పు: సోషల్ మీడియాలో ఫ్రీ అని పాటుపడితే నో వార్నింగ్, నో వారెంట్, డైరెక్టుగా జైలే!అయోధ్య తీర్పు: సోషల్ మీడియాలో ఫ్రీ అని పాటుపడితే నో వార్నింగ్, నో వారెంట్, డైరెక్టుగా జైలే!

శిల్పి మృతితో తాత్కాలికంగా బ్రేక్

శిల్పి మృతితో తాత్కాలికంగా బ్రేక్

ప్రముఖ శిల్పి చంద్రకాంత్ భాయ్ సోమ్ పూర ఆకస్మిక మృతితో రామమందిరం కోసం నిర్మాణంలో ఉన్న శిల్పాలు చెక్కడం తాత్కాలికంగా నిలిపివేశారు. అయోధ్య తీర్పు ప్రకటించారని, చంద్రకాంత్ భాయ్ సోమ్ పూర్ కు మరోసారి నివాళులు అర్పించిన తరువాత పనులు ప్రారంభిస్తామని రామమందిరం శిల్పాలు చెక్కుతున్న ఓ శిల్పి అన్నారు.

అక్కడే వివాదం !

అక్కడే వివాదం !

1528లో హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి జన్మస్థలం ఆయోద్యలో బాబర్ మసీదు నిర్మించారని చరిత్ర చెబుతోంది. 1885లో మొదటిసారి అయోధ్య స్థలం వివాదం కోర్టు మెట్టలు ఎక్కింది. అప్పటి నుంచి నేటి వరకూ అయోధ్య వివాదం కోర్టులో నానుతూ వచ్చింది. ఎట్టకేలకు 2019 నవంబర్ 9వ తేదీన అయోధ్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు చెప్పడంతో ఈ వివాదానికి తెరపడింది.

మసీదు ధ్వంసం

మసీదు ధ్వంసం

1992లో కరసేవకలు అయోధ్యలో మసీదు ధ్వంసం చేశారు. హిందువులకు మంజూరైన భూమిని అప్పటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. బాబ్రీ మసీదు నిర్మాణం కాకముందే అక్కడ హిందువులు రాముడికి పూజలు చేశారని కరసేవకలు ఇంతకాలం వాదిస్తూ వచ్చారు.

రామమందిరానికి లైన్ క్లియర్

రామమందిరానికి లైన్ క్లియర్

దశాభ్దాలు తరబడి సాగుతున్న అయోధ్య వివాదానికి సర్వన్నోత న్యాయస్థానం నేడు తెరదించింది. వివాదాస్పద అయోధ్య స్థలం రామజన్మ న్యాస్ కు కేటాయిస్తూ శనివారం సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు చెప్పింది. సుప్రీం కోర్టు తీర్పుతో రామమందిరం నిర్మాణం కోసం శిల్పాలు చెక్కుతున్న శిల్పులు రాతి శిల్పాలు చెక్కడానికి సిద్దం అయ్యారు.

English summary
Lucknow: Ayodhya Verdict: Main Sculptor Of Ram Mandir Karyashala Dies in Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X