వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐదెకరాల భూమి భిక్ష కాదు, పరిహారం..బాబ్రీ మసీదును కూల్చిన మొదటి వ్యక్తి, ప్రస్తుత ముస్లిం..

|
Google Oneindia TeluguNews

పరిస్థితులు ఎప్పుడు, ఎవరినీ ఎటు వైపు తీసుకెళ్తాయో తెలియదు. ఒకప్పటి హిందుత్వవాదులు కూడా ముస్లిములు అయిపోతారు. ఇలాంటి అలాంటి ముస్లింలు కాదు.. 100 మసీదులు కట్టించే పవిత్రులు కూడా అవుతారు. ఔను మీరు చదివింది నిజమే. మహ్మద్ అమీర్, మహ్మద్ ఉమర్ అనే ఇద్దరూ ఏకంగా 100 మసీదులు కట్టించారు. అయితే వీరు ఎందుకు మసీదులు కట్టించారో తెలియాలంటే ఈ స్టోరీని చదవండి.

ముస్లింగా హిందుత్వవాది..

ముస్లింగా హిందుత్వవాది..

ఇప్పటి మహ్మద్ అమీర్.. ఒకప్పటి హిందుత్వవాది. అతని పేరు బల్బీర్ సింగ్. 1992లో అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చిన మొదటి వ్యక్తి ఇతనే. 1992 డిసెంబర్ 1న వేలాదిమంది కర సేవకులతో కలిసి బల్బీర్.. అయోధ్య వెళ్లాడు. 6వ తేదీన అక్కడ మధ్య గోపురం ఎక్కాడు. అందరి కన్నా ముందుగానే మసీదును కూల్చివేశాడు. ఇతనిపోటు మరో కరసేవకుడు ఉన్నాడు. ఇక అక్కడినుంచి ఇంటికొచ్చాక బల్బీర్‌ను చూసి గ్రామస్థులు ప్రశంసలతో ముంచెత్తారు. అతను ఒక్కసారిగా హీరో అయిపోయాడు. కట్ చేస్తే బల్బీర్ కాస్త మహ్మద్ అమీర్‌గా మారిపోయాడు.

మొదటి వ్యక్తి..

మొదటి వ్యక్తి..

బాబ్రీ మసీదు తొలి గోపురాన్ని కూల్చిన బల్బీర్ ఎందుకు ముస్లింగా మారాడని ప్రశ్నిస్తే.. అతను ఆ మతానికి చెందిన అమ్మాయిని పెళ్లిచేసుకోవడమే. తర్వాత మతం మారాడు. మతం మారి ఊరికే ఉండేలేదు.. ఒక పాఠశాల స్థాపించాడు. అందులో ఇస్లాన్ని బోధించాడు. అంతేకాదు తన స్నేహితుడితో కలిసి చేసిన పాపాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100 మసీదులను నిర్మించాడు.

అసదుద్దీన్ భిన్న స్వరం

అసదుద్దీన్ భిన్న స్వరం

అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీనిని రాజకీయ పక్షాలన్నీ స్వాగతించాయి. సున్నీ వక్ఫ్ బోర్డుకు ఐదెకరాల స్థలం ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. అయితే ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ మాత్రం భిన్న స్వరం వినిపించారు. అయోధ్యలో మరో చోట ఐదెకరాల భూమి తమకు భిక్ష అని మండిపడ్డారు. దీనిపై అమీర్ స్పందించారు. ఐదెకాల భూమి భిక్ష కాదు పరిహారం అని అమీర్ స్పస్టంచేశారు. సుప్రీంకోర్టు తీర్పును అన్నిపక్షాలు స్వాగతించిన విషయాన్ని గుర్తుచేశారు.

సరికాదు

సరికాదు

సుప్రీంకోర్టు తీర్పుపై కూడా న్యాయపరంగా పోరాడుతామని అసదుద్దీన్ ఓవైసీ స్పష్టంచేశారు. తన అభిప్రాయం చెప్పానని పేర్కొన్నారు. కానీ అసద్ వ్యాఖ్యలను అమీర్ తప్పుపట్టారు. ప్రభుత్వం ఇస్తోన్న భూమిని భిక్ష అని ఎందుకంటారని.. పరిహారంగా అనుకోరా అని ప్రశ్నించారు. ఓ రాజకీయ నేతగా వ్యాఖ్యలు సరికాదని కౌంటర్ ఇచ్చారు.

English summary
Ayodhya verdict: mohammed Aamir who had participated in the demolition of the Babari Masjid in Ayodhya and later converted to Islam, on Sunday lashed out at Asaduddin Owaisi over his 'khairat' remark.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X