వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Ayodhya verdict : స్పందించిన ప్రియాంకా గాంధీ .. హింసకు చోటివ్వకండి

|
Google Oneindia TeluguNews

అయోధ్య వివాదం కేసులో సుప్రీం కోర్టు తన తీర్పును వెల్లడించింది. అయోధ్య వివాదాస్పద స్థలాన్ని హిందువులకు, ప్రత్యామ్నాయ స్థలాన్ని ముస్లింలకు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకాభిప్రాయంతో అయోధ్య కేసుపై తీర్పును వెలువరించింది. ఉత్కంఠభరితంగా సాగిన జస్టిస్ రంజన్ గొగోయ్ తీర్పులో ముందుగా... అయోధ్య భూమి విషయంలో రాజకీయాలు చరిత్రకు అతీతంగా తీర్పు ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాల్నీ, నమ్మకాల్నీ సుప్రీంకోర్టు గౌరవిస్తుందని తెలిపారు.

Ayodhya: సుబ్రమణ్యస్వామి తాజా పిటిషన్ విచారణకు 'నో’ చెప్పిన సుప్రీంAyodhya: సుబ్రమణ్యస్వామి తాజా పిటిషన్ విచారణకు 'నో’ చెప్పిన సుప్రీం

బాబ్రీ మసీద్ నిర్మాణానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు లేవని, రామజన్మభూమి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. అయోధ్య వివాదాస్పద స్థలంలో మసీదు నిర్మాణానికి ముందు ఒక నిర్మాణం ఉండేదని పేర్కొంది ఇక మొఘలుల కాలం నుండే బాబ్రీ మసీదు పై తమకు హక్కు ఉందని వక్ఫ్ బోర్డు నిరూపించలేక పోయిందని స్పష్టం చేసినా సుప్రీం ధర్మాసనం పురావస్తు శాఖ ఆధారాలను సమర్పించిన కారణంగా అయోధ్యలోని వివాదాస్పద స్థలం హిందువుల దేనని పేర్కొంది.

Ayodhya verdict : Priyanka Gandhi appeal.. Dont give any chance to violence

ఇక అయోధ్య వివాదాస్పద భూమిపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ స్పందించారు దేశ అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇచ్చినప్పటికీ మనం మాత్రం సంయమనం పాటించాలని ప్రియాంక గాంధీ తెలిపారు.

వేల ఏళ్ల నాటి భారతీయ సాంప్రదాయమైన ఐకమత్యాన్ని ప్రదర్శించాల్సిన బాధ్యత మనపై ఉందని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. అంతేకాదు మనమంతా పరస్పర ప్రేమను, సామాజిక సామరస్యాన్ని పెంపొందించుకోవాలని చెప్పిన ప్రియాంక గాంధీ, మహాత్మా గాంధీ పుట్టిన దేశం లో హింసకు తావు ఉండకూడదని పేర్కొన్నారు. దేశ శాంతిని కాపాడటం మన విధి అన్న ప్రియాంక గాంధీ కోర్టు తీర్పు నేపథ్యంలో సంయమనం పాటించాలని ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు.

English summary
Priyanka Gandhi said that we should abstain despite the verdict given by the country's highest court. Priyanka Gandhi has said that we have a responsibility to demonstrate the unity of the Indian tradition of thousands of years. Priyanka Gandhi said that we all want to cultivate mutual love and social harmony and that there should be no violence in the country where Mahatma Gandhi was born.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X