వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు.. కమ్యూనిస్టుల స్పందన ఏమిటంటే

|
Google Oneindia TeluguNews

అయోధ్య తీర్పుపై కమ్యునిస్టులు మిశ్రమ స్పందన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు తీర్పును ఫిర్యాదుదారుల విజయంగా చూడకూడదని భారత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్టు (సీపీఎం) పార్టీ ప్రకటించింది. అయితే సుప్రీం ధర్మాసనం వెలువరించిన తీర్పులో కొంత ప్రశ్నార్థకమైన విషయాలు ఉన్నాయని తెలిపారు. ఏది ఏమైన తీర్పుపై ఎవరు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని పిలుపునిచ్చారు.

తీర్పు తరువాత అయోధ్య ఎలా ఉందంటే..? రామజన్మభూమి వాసుల మనోగతం.. ముస్లింలు కూడా.. !తీర్పు తరువాత అయోధ్య ఎలా ఉందంటే..? రామజన్మభూమి వాసుల మనోగతం.. ముస్లింలు కూడా.. !

అయితే 1992లో బాబ్రీ మసీదు కూల్చివేయడంపై వ్యాఖ్యానించిన కోర్టు, ఆ సంఘటన చట్టవిరుద్దమైన చర్యగా పేర్కొన్నారు. అది కుట్రపూరితంగా జరిగిందని లౌకిక విధానంపై దాడిగా అభివర్ణించిందని పార్టీ నేతలు తెలిపారు. దీంతో కూల్చివేతలకు సంబంధించిన కేసులను కూడ వేగవంతం చేసి దోషులను శిక్షించాలని కోరారు. ఇక చర్చల ద్వార పరిష్కారం కాని సమస్యలను న్యాయవవస్థ ద్వారా పరిష్కారించాలని పార్టీ ఎప్పటి నుండో కోరుతుందని అన్నారు. ఇక తీర్పుకు సంబంధించి ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని, అవి మత సామరస్యాన్ని దెబ్బతీస్తాయని పార్టీ అభిప్రాయపడింది. కాగా నేడు తీర్పు వెలువరించిన సుప్రీం ధర్మాసనం కూడ కట్టడాన్ని కూల్చడం చట్టవిరుద్దమని వ్యాఖ్యానించింది.

Ayodhya verdict shouldnt be seen as victory for any litigant: Left

దశాబ్దాల వివాదానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల బృందం ఏకగ్రీవ తీర్పును వెలువరించింది. అయోధ్య వివాద స్థలం రామజన్మ న్యాస్‌కు చెందుతుందని స్పష్టం చేసింది. రామాలయ నిర్మాణం కోసం ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని చెప్పింది. ఇక మసీదు నిర్మాణానికి సంబంధించి అయోధ్యలోనే అయిదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది.

English summary
Supreme Court's Ayodhya verdict should not be seen as a victory for any litigant and no one should indulge in any "provocative acts" in the wake of the order The Left parties said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X