వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

5న అయోధ్యకు మోదీ వెంట అద్వానీ.. బాబ్రీ మసీదు కేసులో 24న విచారణ..

|
Google Oneindia TeluguNews

ప్రఖ్యాత అయోధ్య నగరంలో ప్రతిష్టాత్మకంగా రామ మందిరం నిర్మాణానికి ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఆగస్టు 5న రామజన్మభూమి వద్ద భూమిపూజతో పనులు ప్రారంభించనున్నట్లు శ్రీరామ‌భ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారని, వెండి ఇటుకను ప్రతిష్టించడం ద్వారా శంకుస్థాపన చేయనున్నారని వెల్లడించారు. కాగా, బీజేపీకి సంబంధించి అతి కీలకమైన ఈ కార్యక్రమంలో మోదీ వెంట సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వానీ కూడా పాల్గొంటారని తెలిసింది.

Recommended Video

Ayodhya : Ram Temple Construction To Begin In Ayodhya On June 10

రామజన్మభూమిలో మందిరం నిర్మించాలన్న ఉద్యమంతో సంబంధం ఉన్న బీజేపీ నేతలు అందరినీ శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించినట్లు సమాచారం. ఆ జాబితాలో అద్వానీతోపాటు మురళీ మనోహర్ జోషి, వినయ్ కతియార్, ఉమా భారతి, సాధ్వి రీతంభర తదితరులు ఉన్నారని, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సహా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా వేడుకలో పాల్గొంటారని వెల్లడైంది.

జగన్‌‌పై కక్ష..చంద్రబాబుతో సాయిరెడ్డి స్కెచ్ - కన్నా కోవర్టు ముసుగు - ఎవరికెవరు ఫిట్టింగ్?జగన్‌‌పై కక్ష..చంద్రబాబుతో సాయిరెడ్డి స్కెచ్ - కన్నా కోవర్టు ముసుగు - ఎవరికెవరు ఫిట్టింగ్?

ayodya: LK Advani Likely To Go With PM Modi: bjp veteran to depose in Babri case

వెండి ఇటుకతో రామ మందిరానికి మోదీ శంకుస్థాపన చేసే దృశ్యాలను అయోధ్య వాసులు ప్రత్యక్షంగా తిలకించేలా నగరమంతటా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని ట్రస్టు డిసైడైనట్లు తెలిసింది. అలాగే, ప్రధాన కార్యక్రమానికి మూడు రోజుల ముందు నుంచే వేద క్రతువులు నిర్వహించనున్నారు. ఇప్పటికే మోదీకి ఆహ్వానం పంపగా, ఆయన ఆగస్టు 5నే అయోధ్యకు రానున్నారని సమాచారం అందిందని గోపాల్ దాస్ తెలిపారు. ఇదిలా ఉంటే..

రఘురామ ట్రంప్ కార్డు.. రాష్ట్రపతి వద్దకు పంచాయితీ.. ఒకనాటి జగన్ పరిస్థితేనన్న రెబల్.. కోర్టు విచారణరఘురామ ట్రంప్ కార్డు.. రాష్ట్రపతి వద్దకు పంచాయితీ.. ఒకనాటి జగన్ పరిస్థితేనన్న రెబల్.. కోర్టు విచారణ

అయోధ్య నగరంలోనే చారిత్రక బాబ్రీ మసీదు కూల్చివేత కేసుకు సంబందించి కీలక పరిణామం చోటుచేసుకుంది. కూల్చివేత కేసులో నిందితులైన ఎల్ కే అద్వానీ సహా బీజేపీ, శివసేన కీలక నేతల వాగ్మూలాన్ని సీబీఐ ప్రత్యేక కోర్టు రికార్డు చేయనుంది. ఈ మేరకు స్పెషల్ జడ్జి జస్టిస్ ఎస్‌కే యాదవ్ తేదీలను ఖరారు చేశారు. అద్వానీ ఈ నెల 24న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో పాల్గొని తన వాగ్మూలాన్ని ఇవ్వనున్నారు. శివసేన ఎంపీ సతీశ్ ప్రధాన్ ఈనెల 22న, బీజేపీకే చెందిన మరో సీనియర్ నేత మురళి మనోహర్ జోషి ఈనెల 23న కోర్టు విచారణకు హాజరుకానున్నారు. సీఆర్పీసీ 313 సెక్షన్ కింద ఈ మేరకు విచారణ చేపడుతున్నట్లు జడ్జి తన ఆదేశాల్లో పేర్కొన్నారు.

English summary
Senior BJP leader Lal Krishna Advani is likely to accompany PM Modi for the "bhoomi pujan" ceremony in Ayodhya. Advani to depose on July 24 in Babri mosque demolition case, M.M. Joshi on July 23.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X