వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభవార్త: ఆయుష్‌లో 26 మిలియన్ ఉద్యోగాలు: సురేష్ ప్రభు

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు శుభవార్త చెప్పారు. వైద్య, ఆరోగ్య రంగం రెండంకెల వృద్ది సాధించే క్రమంలో ఆయుష్ పరిశ్రమలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు రానున్నాయని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు చెప్పారు.

ప్రభుత్వ రంగంలో ఉద్యోగావకాశాలను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. అయితే వైద్య, ఆరోగ్య రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.

వైద్య, ఆరోగ్య శాఖ రెండంకెల వృద్దిని సాధించేందుకు ఆయుష్‌ను ఎంచుకొంది. ఆయుష్ ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలను కల్పించేలా కేంద్రం ప్లాన్ చేస్తోందని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు చెప్పారు.

ఆయుష్ ద్వారా ఉద్యోగావకాశాలు

ఆయుష్ ద్వారా ఉద్యోగావకాశాలు

వైద్య,ఆరోగ్య రంగం రెండంకెల వృద్ధి సాధించే క్రమంలో ఆయుష్‌ పరిశ్రమలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర మంత్రి సురేష్‌ ప్రభు చెప్పారు.2020 నాటికి ఆయుష్‌ పరిశ్రమలో పది లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు, 2.5 కోట్ల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు సమకూరుతాయని మంత్రి తెలిపారు.

దేశీయ మార్కెట్లో రూ. 500 కోట్ల ఎగుమతులు

దేశీయ మార్కెట్లో రూ. 500 కోట్ల ఎగుమతులు

ఆయుర్వేద, యోగ,నేచురోపతి,యునాని,సిద్ధ,హోమియోపతి వైద్య విధానాలను కలిపి ఆయుష్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం దేశ ఆయుష్‌ మార్కెట్‌ రూ 500 కోట్లు. రూ 200 కోట్ల మేర ఎగుమతులు సాగుతున్నాయి. హాలిస్టిక్‌ హెల్త్‌కేర్‌లో స్టార్టప్‌ల కోసం యువత ఆసక్తి కనబరుస్తోందని మంత్రి తెలిపారు. వెల్‌నెస్‌,ఆరోగ్య 2017 సదస్సులో సురేష్ ప్రభు ఈ విషయాలను ప్రకటించారు.

టెక్నాలజీని సంప్రదాయ పద్దతులతో ఉపయోగించాలి

టెక్నాలజీని సంప్రదాయ పద్దతులతో ఉపయోగించాలి

సంప్రదాయ వైద్య విధానాల విషయంలో సాంకేతికత, విజ్ఞానాన్ని మేళవించేందుకు పలు దేశాలతో కలిసి పనిచేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకొంటుందని చెప్పారు.

ఆయుష్‌లో విదేశీ పెట్టుబడులకు ఓకే

ఆయుష్‌లో విదేశీ పెట్టుబడులకు ఓకే

ఆయుష్‌ రంగంలో నూరు శాతం విదేశీ పెట్టుబడులకు కేంద్రం అనుమతించిందని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ప్రకటించారు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలను తీసుకొంటుంది. ఇందులో భాగంగానే ఆయుష్‌లో ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగ అవకాశాల కోసం చర్యలను తీసుకొంటున్నట్టు సురేష్ ప్రభు చెప్పారు.

English summary
The AYUSH industry is expected to grow in double digits and provide direct employment to 1 million people and indirect jobs to 25 million persons by 2020, Union minister Suresh Prabhu said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X