• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాం దేవ్ బాబా: సీటీఆర్ఐ పర్మిషన్‌తోనే డ్రగ్, ఆయుష్ మంత్రిత్వశాఖతో కమ్యునికేషన్ గ్యాప్, కరోనిల్‌...

|

కరోనా వైరస్ కోసం యోగా గురువు రాందేవ్ బాబా కంపెనీ పతంజలి ఆవిష్కరించిన కరోనిల్‌‌పై కేంద్రం అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. ఆ మందుకు సంబంధించి ప్రచారం చేయొద్దని, వివరాలు నివేదించాలని ఆయుష్ మంత్రిత్వశాఖ కోరింది. దీంతో యోగా గురువు రాం దేవ్ బాబా స్పందించారు. కరోనిల్, స్వసరి మందులు కరోనా వైరస్ రోగులపై వందశాతం పనిచేశాయని పేర్కొన్నారు.

  Coronil : Baba Ramdev VS Ayush Ministry పతంజలి కరోనా డ్రగ్ కరోనిల్ పై అభ్యంతరాలు...!!

  కరోనాకు పతంజలి మందు విడుదల చేసిన రాం దేవ్ బాబా.. మూడు రోజుల్లోనే వ్యాధి నయమట..! కరోనాకు పతంజలి మందు విడుదల చేసిన రాం దేవ్ బాబా.. మూడు రోజుల్లోనే వ్యాధి నయమట..!

  కరోనాకు డ్రగ్ తయారుచేసే ముందు అన్నీ అనుమతులు తీసుకున్నామని స్పష్టంచేశారు. డ్రగ్ వివరాలు, అందులో వాడిన మూలికల వివరాలు, పరిమాణానికి సంబంధించి ఇప్పటికే ఆయుష్ మంత్రిత్వశాఖకు అందజేశామని.. అవి త్వరలోనే వారికి చేరుకుంటాయని తెలిపారు. మెడిసిన్‌కు సంబంధించి కూడా అన్ని వివరాలు మీడియాకు వివరించానని.. తాము చట్టాన్ని ఎక్కడ అతిక్రమించలేదని స్పష్టంచేశారు.

  100 శాతం క్యుర్

  100 శాతం క్యుర్

  ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రకటనలు నిలిపివేయాలనే అంశాన్ని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. తప్పుడు సమాచారాన్ని ప్రకటనలు ఇవ్వడం లేదు, క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి, 100 శాతం రోగులు కోలుకున్నాకే ప్రజలు చెబుతున్నామని.. ఇందులో తప్పేముంది అని రాందేవ్ బాబా ప్రశ్నించారు. ప్రజలకు తాము తప్పుడు సమాచారం ఇస్తున్నారా అని అడిగారు.

   అభినందించాల్సింది పోయి..

  అభినందించాల్సింది పోయి..

  మెడిసిన్‌కు సంబంధించి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించకుండా.. డైరెక్టుగా రిలీజ్ చేస్తే తప్పుపట్టాలి. మేం సరైన పద్దతిలో వైరస్‌కు మందు కనుకొని, ప్రజలకు చూపిస్తే తప్పుపట్టడం సరికాదని రాం దేవ్ బాబా అన్నారు. పతంజలి చేసిన పరిశోధన, డ్రగ్ కనుగొనడంతో ప్రభుత్వం తమను అభినందించాల్సింది పోయి.. అవమానించడం సరికాదన్నారు. దీనిపై ఇప్పటికే ఆయుష్ అధికారులతో మాట్లాడామని... డ్రగ్‌కు సంబంధించి సమాచారం లేదు అని చెప్పడంతో, పరిశోధనలకు సంబంధించిన వివరాలను పంపించామని పేర్కొన్నారు.

  నిబంధనల మేరకే

  నిబంధనల మేరకే

  ఆధునిక వైద్య విజ్ఞాన శాస్త్రం పరిమితుల మేరకు వైరస్ కోసం మందును కనుక్కొన్నామని, తమ వద్ద సాక్ష్యాలు ఉన్నాయని రాం దేవ్ బాబా వివరించారు. అందుకే మందును కనుగొన్నామని ప్రపంచానికి చాటామని, అందుకు తమ వద్ద సరైన పత్రాలు ఉండటమే కారణం అని చెప్పారు. కానీ నిబంధనలను ఉల్లంఘించారనడం అర్థం లేని వాదన అవుతోందని ఒకింత ఆగ్రహాం వ్యక్తం చేశారు.

  కమ్యునికేషన్ గ్యాప్

  కమ్యునికేషన్ గ్యాప్


  ఒకవేళ ఆయుర్వేదం పనిచేయకుంటే.. తమ అధ్యయనాలు వందశాతం ఫలితాలను ఎలా ఇచ్చాయి అని ప్రశ్నించారు. కరోనిల్‌లో 100 కంటే ఎక్కువ క్రియశీల పదార్థాలు ఉన్నాయి. దీంతో వైరస్ తగ్గుతోంది అని... ఇందులో ఎలాంటి మాయ లేదన్నారు. వైరస్‌కు సంబంధించి ఐసీఎంఆర్ క్లినికల్ ట్రయల్ రిజిస్ట్రీ (సీటీఆర్ఐ) ఆమోదం తీసుకొని డ్రగ్ రూపొందించామని, కానీ ఆయుష్ మంత్రిత్వశాఖను కమ్యునికేట్ చేయకపోవడంతో వివాదం చెలరేగిందని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ సంస్థల మధ్య సమాచారం ఇవ్వడంలో లోపమే తప్ప.. తమ సంస్థ తప్పు చేయలేదని స్పష్టంచేశారు.

  ఆమోదం లభించిన తర్వాతే..

  ఆమోదం లభించిన తర్వాతే..


  సీటీఆర్ఐ, ఎతిక్స్ కమిటీ ఆమోదం తెలిపిన తర్వాతే జైపూర్ నిమ్స్ వద్ద అధ్యయనం ప్రారంభించామని రాందేవ్ బాబా తెలిపారు. ఇందులో వివాదానికి తావులేదని పేర్కొన్నారు. కరోనా వైరస్ కోసం వ్యాక్సిన్ కనుగోనాలని ప్రధాని మోడీ ఎంకరేజ్ చేస్తుంటే.. దానిని చొరవగా తీసుకొని మందును రూపొందించామని పేర్కొన్నారు. అంతేకాదు వైరస్ సోకిన వారే కాదు.. సాధారణ ప్రజలు కూడా కరోనిల్, స్వసరీ తీసుకోవచ్చని.. దీంతో శ్వాసకోశ వ్యవస్థ బలోపేతమై, రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు.

  English summary
  Ramdev claimed that Ayurved-based 'Coronil and Swasari' medicine have shown 100 per cent favourable results during clinical trials on Covid-19. we take permission to icmrs ctri but communication gap with ayush.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X