వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ మూడు దేశాల జనాభాతో సమానంగా లబ్ధి: ఆయుష్మాన్ భారత్ ప్రారంభించిన మోడీ

|
Google Oneindia TeluguNews

రాంచీ: ప్రధాని నరేంద్ర మోడీ జార్ఖండ్‌లో ఆదివారం ఆయుష్మాన్ భారత్‌ను జార్ఖండ్ రాజధాని రాంచీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడారు. ఆయుష్మాన్ భారత్ పథకంతో భారత దేశం సరికొత్త మెడికల్ హబ్‌గా మారుతుందని చెప్పారు.

ప్రధానమంత్రి జన్ ఆరోగ్య అభియాన్ (పీఎంజేఏవై) పథకానికి ప్రజలు 'మోడీ కేర్' అంటూ పలు రకాల పేర్లు పెడుతున్నారని, కానీ తాను మాత్రం దీనిని పేద ప్రజలకు సేవ చేసే అవకాశం దొరికిందని భావిస్తున్నానని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ వంటి పథకం ప్రపంచంలో ఏ దేశంలోను లేదన్నారు.

Ayushman Bharat Launch: PM Modi Launches Jan Arogya Abhiyan

నేను ఓ మాటను గట్టి విశ్వాసంతో చెబుతున్నానని, రానున్న రోజుల్లో మెడికల్ ఫీల్డ్‌లో ఉన్న వారు ఈ పథకాన్ని బట్టి తమ తమ కొత్త స్కీంలు తీసుకు వస్తారని చెప్పారు. అమెరికా, కెనడా, మెక్సికో దేశాలలో ఎంతమంది ప్రజలు ఉన్నారో.. ఆ మూడు దేశాల ప్రజలకు సమానంగా ఇక్కడ ఈ స్కీం ద్వారా లబ్ధి పొందనున్నారని చెప్పారు.

కాగా, 10.74కు పైగా కుటుంబాలకు ఎంతో లబ్ధి చేకూర్చే, బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జాతీయ ఆరోగ్య రక్షణ పథకం.. ఆయుష్మాన్ భారత్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్యబీమా. ఈ మేరకు మోడీ పేరుతో పలువురికి లేఖలు వెళ్లాయి.

ఇందులో ప్రధాని మోడీ ఫొటోతో పాటు బీమా పథకం వల్ల కలిగే లాభాలను, ఏయే ఆసుపత్రులలో ఇది వర్తిస్తుందనే వివరాలను పొందుపర్చారు. ఆదివారం జార్ఖండ్‌లోని 57లక్షల కుటుంబాలకు ఈ లేఖలు చేరనున్నాయి. ఆయా ప్రాంతాల్లోని ఆసుపత్రులలో ఈ పథకం వర్తిస్తుందనే వివరాలు ఉన్నాయి. దీనికి కింద ఎటువంటి సౌకర్యాలు పొందవచ్చనేవి తెలియజేస్తూ 2 పేజీల లేఖలు పంపించారు.

ఈ పథకం తొలి ఆరోగ్య కేంద్రాన్ని మోడీ ఏప్రిల్ నెలలో ఛత్తీస్‌గఢ్‌లో ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి రూ.5లక్షల వరకు బీమా కల్పిస్తారు. 10 కోట్లకు పైగా పేద కుటుంబాలు దీని వల్ల లబ్ధి పొందుతాయి. ఈ పథకం కోసం రూ.1200కోట్లను కేటాయించారు. సమగ్ర ఆరోగ్య సంరక్షణ కింద 1.5లక్షల కేంద్రాలను ఏర్పాటు చేసి పేదలకు వైద్య సేవలు అందిస్తారు.

English summary
Prime Minister Narendra Modi has launched Ayushman Bharat, billed as the world’s largest government-funded healthcare programme. The Ayushman Bharat scheme, which would benefit 50 crore Indians, will be rolled out from Jharkhand’s capital Ranchi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X