• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అయ్యప్ప ఆలయం మూసివేత..! ఇద్దరు మహిళల దర్శనంతో శబరిమలలో టెన్షన్

|

కేరళ : శబరిమలలో మళ్లీ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. బుధవారం తెల్లవారుజామున ఇద్దరు మహిళా భక్తులు ఆలయంలోకి ప్రవేశించడం వివాదస్పదమైంది. 50 ఏళ్ల లోపు మహిళలను ఆలయంలోకి అనుమతించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై ఇప్పటికే అయ్యప్ప భక్తులు మండిపడుతున్నారు. ఈక్రమంలో కనకదుర్గ, బిందు అనే మహిళలు అయ్యప్పను దర్శించుకోవడం చర్చానీయాంశమైంది. దీంతో శబరిమల ఆలయంను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ప్రకటించారు.

  Sabarimala Temple : 2 Women Below 50 Enter Sabarimala, Video Viral
  దర్శనం నిజమే.. ధృవీకరించిన సీఎం

  దర్శనం నిజమే.. ధృవీకరించిన సీఎం


  సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా అయ్యప్ప దర్శనానికి 50 ఏళ్ల లోపు మహిళలు వస్తూనే ఉన్నారు. అయితే అయ్యప్ప భక్తులు అడ్డుకుంటుండటంతో వారు వెనుదిరగాల్సిన పరిస్థితి. ఈక్రమంలో శబరిమల పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అదలావుంటే తాజాగా ఇద్దరు మహిళలు అయ్యప్పను దర్శించుకున్నారనే వీడియో వైరలయింది. కనకదుర్గ, బిందు అనే 40 ఏళ్ల లోపు వయసున్న మహిళలు పోలీస్ ఎస్కార్ట్‌తో తెల్లవారుజామున ఆలయంలోనికి ప్రవేశించారు. ఈమేరకు కేరళ సీఎం పినరాయి విజయన్ కూడా ధృవీకరించారు. పోలీసుల సహాయంతో ఈ మహిళలిద్దరు స్వామిని దర్శించుకున్నట్లు ప్రకటించారు.

  నల్లటి దుస్తులు ధరించిన కనకదుర్గ, బిందు అర్ధరాత్రి పంబ బేస్ క్యాంప్ నుంచి బయలుదేరి స్వామి సన్నిధికి చేరుకున్నారు. తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాలకు స్వామివారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో పెద్దగా భక్తజన సందోహం లేకపోవడంతో వీరికి కలిసొచ్చింది. దర్శనం కూడా క్షణాల్లో అయిపోయింది. వీరిద్దరు డిసెంబర్ 24వ తేదీన స్వామివారి దర్శనానికి ప్రయత్నించారు. అయితే అయ్యప్ప భక్తులు అడ్డుకోవడంతో పంబ నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. ఎట్టకేలకు బుధవారం స్వామివారి సన్నిధికి చేరుకున్న సందర్భంగా బయటకు వచ్చిన తర్వాత వీరిద్దరు విజయోత్సాహంతో కేరింతలు కొడుతూ నృత్యాలు చేసినట్లు తెలుస్తోంది.

  మరిన్ని వార్తల కోసం

  ఆలయం మూసివేత..! శుద్ధి తర్వాతే ఓపెన్

  ఆలయం మూసివేత..! శుద్ధి తర్వాతే ఓపెన్

  40 ఏళ్ల వయస్సులోపు ఇద్దరు మహిళల ప్రవేశంలో అయ్యప్ప ఆలయం తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు ప్రధాన అర్చకులు. తరతరాలుగా వస్తున్న ఆచారానికి భిన్నంగా బుధవారం నాడు ఇద్దరు మహిళలు స్వామివారి సన్నిధికి చేరుకోవడంతో ఆలయాన్ని సంప్రోక్షణ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆలయాన్ని పూర్తిస్థాయిలో శుద్ధి చేసిన తర్వాత తిరిగి తెరిచే అవకాశముంది.

  శబరిమల సన్నిధిలో ఇద్దరు శబరిమల సన్నిధిలో ఇద్దరు "మహిళా భక్తులు".. తెల్లవారుజామున "దర్శనం"

  బిందు ఇంటి దగ్గర భారీగా పోలీసులు

  బిందు ఇంటి దగ్గర భారీగా పోలీసులు

  అయ్యప్ప ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించారనే అంశం వివాదస్పదంగా మారడంతో కేరళ పోలీసులు అలర్టయ్యారు. శబరిమలతో పాటు పలు చోట్ల బలగాలను మోహరించారు. అదేక్రమంలో కోయిలండిలోని బిందు ఇంటికి రక్షణ కల్పించినట్లు సమాచారం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆమె ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించినట్లు తెలుస్తోంది. అయితే బిందు ఇంటికి తాళం వేసి ఉంది. అయ్యప్ప భక్తులు అటాక్ చేయొచ్చనే భయంతో ముందస్తు జాగ్రత్తగా ఫ్యామిలీ మొత్తం అక్కడినుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.

  డిసెంబర్ 16న ట్రాన్స్‌జెండ‌ర్లు..!

  డిసెంబర్ 16న ట్రాన్స్‌జెండ‌ర్లు..!

  మహిళలు శబరిమల అయ్యప్పను దర్శించుకోవచ్చనే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో.. నలుగురు ట్రాన్స్‌జెండ‌ర్లు స్వామి వారి సన్నిధికి చేరారు. డిసెంబర్ 16న అయ్యప్ప దర్శనానికి వచ్చిన ట్రాన్స్‌జెండ‌ర్లను పోలీసులు అడ్డుకున్నారు. అయితే వారు ఆందోళనకు దిగడంతో.. ఆలయ ప్రధాన పూజారితో చర్చించారు. ఆయన ఓకే చెప్పడంతో ఈ నలుగురికి దర్శనభాగ్యం కలిగింది. డ్రెస్ కోడ్ లో ఇరుముడితో సంప్రదాయబద్ధంగా వచ్చిన వీరికి పోలీసులు భద్రత కల్పించారు. శబరిమలలో పవిత్రంగా భావించే 18 మెట్లను ఎక్కి సన్నిధానంకు చేరుకున్నారు.

  English summary
  The Sabarimala again has a tension atmosphere. The entry of two women devotees in the early hours of Wednesday was controversial.The temple chief priests declared that the Sabarimala temple was closed temporarly. The temple can be reopened after full refinement.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X