వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పశ్చిమ బెంగాల్ నుంచి ఎంపిగా అజరుద్దీన్ పోటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

 Mohammed Azharuddin
న్యూఢిల్లీ‌‌: హైదరాబాదుకు చెందిన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, లోకసభ సభ్యుడు మొహమ్మద్ అజరుద్దీన్ తన స్థానాన్ని మార్చుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ నుంచి లోకసభకు పోటీ చేసే ఆలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం.

అజరుద్దీన్ 2009 ఫిబ్రవరిలో కాంగ్రెసు పార్టీలో చేరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ లోకసభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. సర్వేష్ కుమార్ సింగ్‌ను ఆయన 50 వేల ఓట్ల మెజారిటీతో ఓడించారు.

కోల్‌కత్తా, ముఖ్యంగా ఈడెన గార్డెన్స్‌తో అజర్‌కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ నుంచి పోటీ చేయాలనే తన ఆసక్తిని ఆయన వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ సీనియర్ కాంగ్రెసు నాయకుడు, రైల్వే శాఖ సహాయ మంత్రి అధీర్ రంజన్ చౌధురికి అజరుద్దీన్ అత్యంత సన్నిహితుడు.

తాను పశ్చిమ బెంగాల్‌లోని ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే విషయాన్ని కాంగ్రెసు పశ్చిమ బెంగాల్ వ్యవహారాల పరిశీలకుడు షకీల్ అహ్మద్, అధీర్ రంజన్ నిర్ణయిస్తారని అజరుద్దీన్ చెప్పారు. 2009 నుంచి ఎన్నో మార్పులు సంభవించాయని, అయితే ప్రజలను అభివృద్ధి దిశగా నడిపించినవాళ్లు గెలుస్తారని ఆయన పిటిఐ వార్తా సంస్థతో అన్నారు.

అజరుద్దీన్ తొలి టెస్టు 21 ఏళ్ల వయస్సులో ఈడెన గార్డెన్స్‌లో ఆడాడు. అంతేకాకుండా తొలి టెస్టు మ్యాచులోనే సెంచరీ చేశాడు. దీంతో ఆయనకు కోల్‌కతా ఈడెన గార్డెన్స్ అంటే తెగ మక్కువ. 1993లో ఇంగ్లాండుపై ఈడెన్ గార్డెన్స్‌లోనే 182 పరుగులు చేసి తన కెప్టెన్సీని ఆయన కాపాడుకున్నారు. ఈ వేదిక మీదే అదే ఏడాది హీరో కప్ గెలుచుకున్నాడు.

English summary

 Former Indian cricket team captain and current Lok Sabha MP Mohammed Azharuddin is likely to contest the 2014 LS elections from a constituency in West Bengal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X