వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐటీ ఎఫెక్ట్, పడిపోతున్నాయి: భారీగా తగ్గిన అజిమ్ ప్రేమ్‌జీ వేతనం

విప్రో సంస్థ చైర్మన్ అజిమ్ ప్రేమ్ జీ వేతనం 63 శాతం తగ్గింది. దేశీయ సాఫ్ట్ వేర్ రంగంలోని ప్రముఖ కంపెనీల్లో విప్రో ఒకటి. దానికి అజిమ్ ప్రేమ్ జీ చైర్మన్‌గా ఉన్నారు.

|
Google Oneindia TeluguNews

ముంబై: విప్రో సంస్థ చైర్మన్ అజిమ్ ప్రేమ్ జీ వేతనం 63 శాతం తగ్గింది. దేశీయ సాఫ్ట్ వేర్ రంగంలోని ప్రముఖ కంపెనీల్లో విప్రో ఒకటి. దానికి అజిమ్ ప్రేమ్ జీ చైర్మన్‌గా ఉన్నారు.

<strong>టెక్కీలకు గడ్డు పరిస్థితి: హెచ్1బి వీసాలను తగ్గించేసిన టీసీఎస్..</strong>టెక్కీలకు గడ్డు పరిస్థితి: హెచ్1బి వీసాలను తగ్గించేసిన టీసీఎస్..

టాప్ టెక్ బిలీనియర్లలో ఒకరైన అజిమ్ ప్రేమ్‌జీ జీతం 2016-17వ సంవత్సరంలో భారీగా తగ్గింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను ఆయన వేతనం 63 శాతం తగ్గి, రూ.79 లక్షలు మాత్రమే అందుకున్నారు.

గత ఏడాది రూ.2.17 కోట్లు

గత ఏడాది రూ.2.17 కోట్లు

ఈ ఏడాదిలో కనీసం ఎలాంటి కమిషన్లను కూడా పొందలేదు. గత ఆర్థిక సంవత్సరంలో అజిమ్ ప్రేమ్ జీ వేతనం రూ.2.17 కోట్లగా ఉంది. ప్రేమ్ జీ ప్యాకేజీలో 66,464 డాలర్ల వేతనం, అలవెన్స్ లు, దీర్ఘకాలిక పరిహారాలు 13,647 డాలర్లు కలిసి ఉన్నాయి.

అందుకున్న జీతం..

అందుకున్న జీతం..

దీంతో మొత్తం ఆయన అందుకున్న జీతం 1,21,853 డాలర్లేనని అమెరికా మార్కెట్ రెగ్యులేటరి సెక్యురిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్‌కు సమర్పించిన డాక్యుమెంట్లలో తెలిసింది.

కమిషన్లు రాలేదు..

కమిషన్లు రాలేదు..

గత ఆర్థిక సంవత్సరం కంటే 2017 ఆర్థిక సంవత్సరంలో కంపెనీకి పెరిగిన నికర లాభాలను బట్టి 0.5 శాతం కమిషన్‌ను అజిమ్ ప్రేమ్ జీకి ఇస్తారు. అయితే 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అజిమ్ ప్రేమ్ జీ ఎలాంటి కమిషన్లను పొందలేదని సెక్యురిటీస్‌కు సమర్పించిన డాక్యుమెంట్లలో పేర్కొన్నారు.

ఐటీ పరిశ్రమలో వృద్ధి మందగించడం వల్లే

ఐటీ పరిశ్రమలో వృద్ధి మందగించడం వల్లే

కాగ ఇటీవల ఐటీ పరిశ్రమలో కంపెనీల వృద్ధి మందగించడంతో కీలక ఎగ్జిక్యూటివ్‌ల పరిహారాలు తగ్గిపోతున్నాయి. వృద్ధి ప్రభావం వీరి పరిహారాలపై పడుతోంది. ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా వేతన ప్యాకేజీ కూడా 67 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరంలో విప్రో వార్షిక ఆదాయాలు 4.7 శాతం తగ్గాయి.

English summary
Wipro chairman Azim Premji’s salary fell to Rs79 lakh in FY17, from about Rs2.17 crore in FY1, as he was not paid any commission during the year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X