వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దాన ధర్మాలు: నెంబర్‌వన్ స్ధానంలో విప్రో ఫౌండర్ అజిమ్ ప్రేమ్‌జీ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: విప్రో వ్యవస్ధాపకుడు అజిమ్ ప్రేమ్‌జీ తన వ్యక్తిగత సంపద నుంచి రూ. 12,316 కోట్ల నిధులను దానధర్మాల కోసం వెచ్చించి నెంబర్ వన్ స్ధానంలో కొనసాగుతున్నారు. బెంగుళూరుకు చెందిన 69ఏళ్ల ఈ పారిశ్రామిక వేత్త దాన ధర్మాలు చేయడంలో ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచారు.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

ఏప్రిల్ 2013 నుంచి అక్టోబర్ 2014 వరకు కేవలం ఒకటిన్నర ఏడాదిలోనే ఇంత పెద్ద మొత్తం మేరకు దాతృత్వం ప్రదర్శించడం విశేషం. భారత్‌లో పెద్ద మొత్తంలో వితరణ చేసిన వ్యక్తుల్లో అజిమ్ ప్రేమ్‌జీ టాప్ అంటూ చైనాకు చెందిన 'ద హరూన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్' పేర్కొంది.

Azim Premji tops list of philanthropists by donating over Rs 12,000 crore in 1.5 years

ఈ జాబితాలో విప్రో అధినేతకు నెంబర్ వన్ ర్యాంకు కేటాయించింది. వేదాంత రిసోర్సెస్ సంస్ధ అధిపతి అనిల్ అగర్వాల్ రూ. 1796 కోట్ల మేరకు దానధర్మాలు చేసి రెండో స్ధానంలో ఉన్నారు. రెండో స్ధానంలో ఉన్న అనిల్ అగర్వాల్‌తో పోల్చితే అజిమ్ ప్రేమ్‌జీ ఆరు రెట్లు అధికంగా వితరణ చేయడం విశేషం.

హెచ్‌సీఎల్ వ్వవస్ధాపకుడు శివ నాడార్ రూ. 1,136 కోట్లు, రతన్ టాటా రూ. 620 కోట్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ రూ. 603 కోట్లు దాన ధర్మాలు చేసి తర్వాతి స్ధానాల్లో ఉన్నారు. నీలకనీలు రూ. 500 కోట్లు వితరణ చేసి ఆరవ స్ధానంలో ఉన్నారు.

English summary
Wipro founder Azim Premji topped the list of the philanthropists as he donated over Rs 12,000 crore of his personal wealth in one and a half years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X