వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జిందాల్ కంపెనీకి 3, 667 ఎకరాల భూమి, రూ. 20 కోట్లు కిక్ బ్యాక్, సీఎం, మాజీ సీఎం రచ్చ రచ్చ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: జిందాల్ కంపెనీకి 3, 667 ఎకరాల భూమి కేటయించడాన్ని నిరసిస్తు కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ఆరోపణలకు మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక శాఖ బీజేపీ శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.

సీబీఐ కోర్టు

సీబీఐ కోర్టు

సీఎం కుమారస్వామి చేసిన ఆరోపణలోలపై మాజీ సీఎం యడ్యూరప్ప సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. సీఎం కుర్చిలో కుర్చున్న కుమారస్వామి ఇలాంటి ఆరోపణలు చెయ్యడం విచిత్రంగా ఉందని అన్నారు. జిందాల్ కంపెనీలో తన మీద వచ్చిన ఆరోపణలు సీబీఐ కోర్టు కొట్టివేసిన విషయం సీఎం కుమారస్వామి మరిచిపోయినట్లు ఉన్నారని యడ్యూరప్ప చెప్పారు.

20 కోట్లు కిక్ బ్యాక్

20 కోట్లు కిక్ బ్యాక్

బీఎస్. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జిందాల్ కంపెనీ నుంచి రూ. 20 కోట్లు చెక్ ను కిక్ బ్యాక్ తీసుకున్నారని ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ఆరోపించారు. యడ్యూరప్ప రూ. 20 కోట్లు కిక్ బ్యాక్ తీసుకున్నారని తానే బహిరంగంగా ఆరోపించానని సీఎం కుమారస్వామి అన్నారు. ఈ విషయాన్ని మరిచిపోయిన యడ్యూరప్ప తన మీద ఆరోపణలు చెయ్యడం విడ్డూరంగా ఉందని సీఎం కుమారస్వామి విరుచుకుపడుతున్నారు.

రాజకీయాలు

రాజకీయాలు

సీఎం కుమారస్వామి ఆరోపణలకు మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఘాటుగా సమాధానం ఇచ్చారు. జిందాల్ కంపెనీకి భూములు కేటాయించిన విషయంలో రాజకీయాలు చెయ్యవలసిన అవసరం తనకులేదని యడ్యూరప్ప అన్నారు. జిందాల్ కంపెనీకి భూములు కేటాయించే విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ఈ ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకునే విషయంలో విఫలం అయ్యిందని యడ్యూరప్ప ఆరోపణలు చేస్తున్నారు.

సీబీఐ కోర్టు

సీబీఐ కోర్టు

తన మీద వచ్చిన ఆరోపణలను సీబీఐ కోర్టు ఎప్పుడో కొట్టివేసిందని మాజీ సీఎం యడ్యూరప్ప గుర్తు చేశారు. తనకు కేసుల నుంచి కోర్టు విముక్తి కల్పించిందని, అయినా ప్రతిపక్షాలు మాత్రం తన మీద ఆరోపణలు చేస్తూనే కాలం వెల్లదీస్తుందని మాజీ సీఎం యడ్యూరప్ప అన్నారు. సీఎం కుమారస్వామి చేస్తున్న ఆరోపణలుకు ఎలాంటి రుజువులు లేవని మాజీ సీఎం యడ్యూరప్ప అంటున్నారు.

English summary
Opposition leader of Karnataka B.S.Yeddyurappa upset with Chief Minister H.D.Kumaraswamy for his comment on Jindal row. Yeddyurappa received 20 crore kick back from Jindal alleged Kumaraswamy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X