బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరదలు, ప్రత్యేక ప్యాకేజీ, ప్రధాని మోడీతో బీజేపీ నాయకుల భేటీ, వాజ్ పేయి హస్తికలు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలోని కొడుగు, దక్షిణ కన్నడ జిల్లాలో భారీ వర్షాలకు అతలాకుతలం అయిన ప్రాంతాల్లోని ప్రజలను ఆదుకోవడానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించాలని బీజేపీ కర్ణాటక శాఖ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప సిద్దం అయ్యారు.

కర్ణాటకలో భారీ వర్షాల కారణంగా అనేక ఆస్తులకు నష్టం జరిగిందని, పేద ప్రజల ఇండ్లు నేలమట్టం అయ్యాయని, వేల ఏకరాల్లో పంట నీట మునిగిపోయిందని, ఈ విషయాలు మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకు వచ్చి ప్రత్యేక ప్యాకేజీ తీసుకురావాలని బీఎస్. యడ్యూరప్ప ఢిల్లీకి వెలుతున్నారు.

B.S.Yeddyurappa will discuss with PM Narendra Modi on flood situation in Kodagu

మంగళవారం ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన బీఎస్. యడ్యూరప్ప బుధవారం (ఆగస్టు 22) ఢిల్లీలో బీజేపీ నాయకుల సమావేశం జరగనుందని అన్నారు. బీజేపీ సమావేశంలో పాల్గొనడానికి తాను ఢిల్లీ వెలుతున్నానని బీఎస్. యడ్యూరప్ప మీడియాకు చెప్పారు.

బీజేపీ సమావేశం పూర్తి అయిన తరువాత కర్ణాటకలో కురుసిన భారీ వర్షాలు, వరదల విషయంపై ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించి రాష్ట్రానికి న్యాయం చెయ్యాలని మనవి చేస్తామని చెప్పారు. కొడుగు, దక్షిణ కన్నడ జిల్లా ప్రజలకు న్యాయం జరిగేలా తాము కేంద్ర ప్రభుత్వానికి మనవి చేస్తామని అన్నారు.

Recommended Video

కేరళకి అన్ని రాష్ట్రా ప్రభుత్వాల నుండి భారీ విరాళాలు

మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి అస్తికలు దేశంలోని అన్ని ప్రముఖ నదులులో విసర్జించాలని నిర్ణయించామని యడ్యూరప్ప అన్నారు. అందులో భాగంగా ఈనెల 23వ తేదీన కృష్ణా, కావేరి, తుంగభద్రా, భీమా, మలప్రభ నదులలో వాజ్ పేయి అస్తికల విసర్జన కార్యక్రమం ఏర్పాటు చేశామని యడ్యూరప్ప చెప్పారు.

ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి పలువురు నాయకులకు బాధ్యతలు అప్పగించామని బీఎస్. యడ్యూరప్ప అన్నారు. ఆగస్టు 26వ తేదీ బెంగళూరులో వాజ్ పేయి శ్రద్దాంజలి కార్యక్రమం ఏర్పాటు చేసి ఘనంగా నివాళులు అర్పిస్తామని బీఎస్. యడ్యూరప్ప మీడియాకు చెప్పారు.

English summary
State Bjp president B.S.Yeddyurappa will discuss with prime minister Narendra Modi on flood situation in Kodagu district as well in Karnataka and likely to seek special package for the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X