వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీరాములు దెబ్బకు సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి విలవిల, విజయం దిశగా బళ్లారి బీజేపీ ఎంపీ!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో ఊహించని రీతిలో బీజేపీ దూసుకుపోతుంది. కర్ణాటకలోని 224 శాసన సభ నియోజక వర్గాలపైకి 222 శాసన సభ నియోజక వర్గాల్లో మే 12వ తేదీన ఎన్నికలు జరిగాయి. 2018 శాసన సభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అని ఉత్కంఠకు తెరపడటానికి ఇంకా కొన్ని గంటల సమయం ఉంది.

విజేతలు ఎవరు !

విజేతలు ఎవరు !

బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ నాయకులు ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని చేసిన ప్రయత్నాల ఫలితాలు నేటితో తేలిపోనున్నాయి. కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో మొత్తం 2, 622 మంది పోటీ చేశారు. 2, 405 మంది పురుషులు, 217 మంది మహిళలు శాసన సభ ఎన్నికల్లో పోటీ చేశారు.

Recommended Video

Karnataka Assembly Elections 2018: Siddaramaiah Likely to Lose in Chamundeshwari
శ్రీరాములు

శ్రీరాములు

బీజేపీ నుంచి 222 మంది, కాంగ్రెస్ నుంచి 220 మంది, జేడీఎస్ నుంచి 199 మంది, బీఎస్పీ నుంచి 18మంది, ఇతరులు 1,963 మంది ఎన్నికల్లో పోటీ చేశారు. కర్ణాటక మాజీ మంత్రి, బళ్లారి బీజేపీ ఎంపీ బి. శ్రీరాములు చిత్రదుర్గ జిల్లా మాళకాల్మూరు శాసన సభ నియోజక వర్గంలో పోటీ చేసిన విషయం తెలిసిందే.

శ్రీరాములు దూకుడు

శ్రీరాములు దూకుడు

మాళకాల్మూరు శాసన సభ్యుడు, బిజేపీ రెబల్ అభ్యర్థి తిప్పేస్వామి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ యోగేష్ బాబును వెనక్కినెట్టిన బళ్లారి బీజేపీ ఎంపీ. శ్రీరాములు అధిక ఓట్లతో ముందుకు దూసుకుపోతున్నారు. మాళకాల్మూరులో బీజేపీ అభ్యర్థి బి. శ్రీరాములు విజయం దిశగా దూసుకుపోతున్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే పై శ్రీరాములు

సిట్టింగ్ ఎమ్మెల్యే పై శ్రీరాములు


మాళకాల్మూరులో బీజేపీ అభ్యర్థి శ్రీరాములుకు 14, 459 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ యోగేష్ బాబుకు 7, 244 ఓట్లు, బీజేపీ రెబల్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామికి 3, 512 ఓట్లు వచ్చాయి. మాళకాల్మూరు శాసన సభ నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థి బి. శ్రీరాములు విజయం దిశగా దూసుకుపోతున్నారు.

English summary
Karnataka election results 2018 : Molkalmur : B Sriramulu leads,Congress Yogeshbabu and independent Tippeswamy trails.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X