వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబా ముద్దులాట .. కరోనా తగ్గుతుందట .. ట్విస్ట్ తెలిస్తే అవాక్కవుతారట

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తుంది .అలాంటి కరోనా మహమ్మారి నుండి బయటపడటానికి ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సిన్ కనుగొనలేదు. ఇక కరోనా తగ్గాలంటే పూజలు చేయాలి, బలి ఇవ్వాలి, వేప చెట్లకు నీళ్లు పోయాలి, గుండ్లు గీయించుకోవాలి వంటి మూఢనమ్మకాలు బాగా ప్రబలుతున్నాయి. ఇక ఇదే సమయంలో తాను ముద్దు పెడితే చాలు కరోనా తగ్గుతుంది అంటూ ఓ బాబా చేసిన హల్చల్ చివరికి అధికారులకు తలనొప్పి తెచ్చిపెట్టింది.

 ముద్దు పెడితే కరోనా మాయం

ముద్దు పెడితే కరోనా మాయం

కరోనా రాకుండా ఉండాలంటే తాను ముద్దు పెడితే చాలు అంటూ ప్రచారం చేసిన బాబా తన దగ్గరకు వచ్చిన వారందరి చేతులు తీసుకొని తెగ ముద్దులు పెట్టేసాడు. ఇక ముద్దుతోనే కరోన తగ్గుతుంది అంటూ గుడ్డిగా నమ్మిన జనాలు బాబా ముద్దుల కోసం క్యూ కట్టారు. చేతికి ముద్దు పెట్టడం ద్వారా కరోనావైరస్ ను పారద్రోలుతానని ప్రకటించిన బాబా తన చికిత్సలో భాగంగా వచ్చినవారందరి చేతులు పట్టుకొని ఎంచక్కా ముద్దులు పెట్టేసాడు.

 ఏకంగా బాబానే ముద్దు పెట్టుకున్న కరోనా

ఏకంగా బాబానే ముద్దు పెట్టుకున్న కరోనా

తన ముద్దుతో కరోనా తగ్గిస్తానన్న బాబాకు కరోనా షాకిచ్చింది .నాతోనే తమాషానా అంటూ ఏకంగా బాబానే ముద్దు పెట్టుకుంది కరోనా. ఫలితంగా అందరి చేతులను ముద్దు పెట్టుకున్న బాబా కరోనా బారినపడి అస్వస్థతకు గురై మరణించాడు. మధ్యప్రదేశ్లోని నయాపుర జిల్లా రత్లాంలో వెలుగు చూసిన ఈ ఘటనతో ఇప్పుడు అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. బాబాతో ముద్దులు పెట్టించుకున్న వారికోసం తెగ వెతుకుతున్నారు. ఇక వారిలో చాలా మందికి కరోనా పాజిటివ్ వచ్చే ఉంటుంది అని ఆందోళన చెందుతున్నారు.

బాబా ముద్దుల ఎఫెక్ట్ .. కరోనా హాట్ స్పాట్ గా జిల్లా

బాబా ముద్దుల ఎఫెక్ట్ .. కరోనా హాట్ స్పాట్ గా జిల్లా

ఇప్పటివరకూ బాబా గారి ముద్దుల నిర్వాకం వల్ల 19 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 30 మందిని అధికారులు క్వారంటైన్ కి తరలించారు. బాబా ముద్దుల ఎఫెక్ట్ నయాపురా జిల్లాను ఇప్పుడు కరోనా హాట్ స్పాట్ గా మార్చింది. కరోనా తగ్గుతుందని మూడ విశ్వాసంతో బాబాతో ముద్దులు పెట్టించుకున్నవారు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. నీ ముద్దు మండి పోను అని బాబాను తెగ తిట్టుకుంటున్నారు.

మూఢ నమ్మకాలతో అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకోకండి

మూఢ నమ్మకాలతో అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకోకండి

అధికారులు మాత్రం ఎవరు ఏది చెబితే అది గుడ్డిగా నమ్మి అనవసరంగా ప్రాణాలను రిస్క్ లో పెట్టుకోవద్దని నెత్తి, నోరు కొట్టుకుని చెబుతున్నారు. భౌతిక దూరం పాటించండి అంటే, చేతులెత్తి మొక్కుతాం, చెయ్యి చెయ్యి కలపొద్దు అంటే ఏకంగా చేతులే ఇచ్చి ముద్దులు పెట్టించుకున్నారని, జనం తీరుతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. అనవసరంగా ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు అని, కరోనా తగ్గించుకోవడం కోసం, రాకుండా ఉండడం కోసం ఎవరు ఏది చెప్తే అది చేయొద్దని దండం పెడుతున్నారు. మరి అధికారులు చెబుతున్న ముద్దు ముద్దు మాటలు, ముద్దులు పెట్టించుకున్న మనోళ్లకు అర్ధమౌతాయో లేదో తెలియదు కానీ మీరు అయితే అర్థం చేసుకోండి.మూఢ నమ్మకాలకు దూరంగా ఉండండి .

English summary
A Baba, who had advertised that his kiss avoid corona . The baba Believers went near to baba for his kisses to erodicate corona .he took the arms of all those who came to him and kissed . finally baba fell sick with corona and died . this incident happened in madhyapradesh state nayapura district .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X