వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నరేంద్ర మోడీ నోట్ల రద్దుపై రాందేవ్ బాబా అసంతృప్తి!

ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా నోట్ల రద్దు తదనంతర పరిణామాల పైన స్పందించినట్లుగా తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా నోట్ల రద్దు తదనంతర పరిణామాల పైన స్పందించినట్లుగా తెలుస్తోంది. ది క్వెంట్‌లో వచ్చిన దాని ప్రకారం.. నోట్ల రద్దు తర్వాత రూ.3 నుంచి 5 లక్షల కోట్ల కుంభకోణం వెలుగు చూస్తుందన్నారు.

నవంబర్ 8వ తేదీన ప్రధాని మోడీ నోట్ల రద్దును ప్రకటించారు. నోట్ల రద్దు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు బ్యాంకు అధికారులు కొత్త నోట్లను వక్రమార్గంలో తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాందేవ్ బాబా స్పందించారు.

ramdev baba

నోట్ల రద్దు తదనంతర పరిణామాల పైన రాందేవ్ బాబా అంత సంతృప్తిగా లేనట్లుగా కనిపిస్తోందని ది క్వెంట్ పేర్కొంది. అవినీతి బ్యాంకు అధికారులు మోడీ నిర్ణయాన్ని తప్పుదారి పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దు అమలు తీరు దారుణంగా ఉందని కూడా మరో పత్రికతో వ్యాఖ్యానించారని పేర్కొంది.

నోట్ల రద్దు అమలును మరింత బాగా చేయవలసి ఉండెనని అభిప్రాయపడ్డారు. పలువురు బ్యాంకర్లు డబ్బును పక్కదారి పట్టిస్తున్నారని అభిప్రాయపడ్డారు. కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారన్నారు. ఇది మన వ్యవస్థ తీరును ప్రశ్నిస్తోందన్నారు.

English summary
Baba Ramdev, who was once Narendra Modi’s confidante, isn’t exactly happy with the Prime Minister’s demonetisation move.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X