వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాట్సప్‌కు షాక్: రాందేవ్ ‘కింభో’ మెసేజింగ్ యాప్, జియోకి పోటీగా పతంజలి సిమ్ ప్లాన్స్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇప్పటికే పతంజలి సిమ్ కార్డులను తీసుకొస్తూ సంచలనం సృష్టించిన యోగా గురు బాబా రాందేవ్.. ఇప్పుడు వాట్సప్‌కు పోటీగా కొత్త దేశీ యాప్‌ను రూపకల్పన చేశారు. 'కింభో' పేరిట రూపొందించిన యాప్‌ను ఆయన ఆవిష్కరించారు.

ఇక భారత్ మాట్లాడుతుంది

ఈ క్రమంలో పతంజలి ప్రతినిధి ఎస్కే తిజారావాలా మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ‘ఇక భారత్ మాట్లాడుతుంది. వాట్సప్‌కు గట్టి పోటీ ఎదురుకాబోతోంది. ఈ స్వదేశీ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి నేరుగా డౌన్‌లోడ్ చేసుకోండి' అంటూ తిజారావాల తెలిపారు.

వాట్సప్ ధీటుగా..

వాట్సప్ ధీటుగా..

కింభో యాప్‌లో వాట్సప్ లాగే ప్రైవేట్, గ్రూప్స్ చాట్ చేసుకోవచ్చు. ఫ్రీ ఫోన్, వీడియో కాలింగ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో చాలా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. షేర్ టెక్స్ట్, ఆడియో, ఫొటోలు, వీడియో, స్టిక్కర్స్, లొకేషన్, జిఫ్స్, డూడుల్ ఉన్నాయి. గూగుల్ ప్లేస్టోర్‌లో ఈ మేరకు వివరాలున్నాయి. ‘ఇక భారత్ మాట్లాడుతుంది' అనేది కింభో ట్యాగ్‌లైన్‌‌గా ఉంది.

పతంజలి సిమ్ వాడితే.. ఉత్పత్తులపై 10శాతం తగ్గింపు

పతంజలి సిమ్ వాడితే.. ఉత్పత్తులపై 10శాతం తగ్గింపు

కాగా, ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్)తో కలిసి స్వదేశీ సమృద్ధి సిమ్ కార్డులను పతంజలి విడుదల చేసిన విషయం తెలిసిందే. రూ.144కే అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు, డేటా అందించనున్నట్లు ప్రకటించింది. అంతేగాక, పతంజలి సిమ్ యూజర్లకు ఆ సంస్థ ఉత్పత్తులపై 10శాతం రాయితీ కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

పతంజలి సిమ్ నుంచి ఆకర్షణీయమైన ప్లాన్స్

పతంజలి సిమ్ నుంచి ఆకర్షణీయమైన ప్లాన్స్

పతంజలి సిమ్ కార్డులు ఆకర్షణీయమైన ప్లాన్లను అందిస్తున్నాయి. అవేమంటే...పతంజలి బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.144 ప్లాన్‌. ఈ ప్లాన్‌ వాలిడిటీ నెల రోజులు. దీనిపై అపరిమిత వాయిస్‌ ఆల్‌ఇండియా రోమింగ్‌, రోజుకు 2 జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు పొందనున్నారు. అంతేగకా, పతంజలి బీఎస్‌ఎన్‌ఎల్‌ స్పెషల్‌ ప్లాన్‌ ఓచర్‌- రూ.792. ఈ ప్లాన్‌ వాలిడిటీ 6 నెలలు. దీనిపై అపరిమిత వాయిస్‌ ఆల్‌ఇండియా రోమింగ్‌, రోజుకు 2జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు. ఇక,

రూ.1584తో పతంజలి బీఎస్‌ఎన్‌ఎల్‌ స్పెషల్‌ ప్లాన్‌ ఓచర్‌ -1584. ఈ ప్లాన్‌ వాలిడిటీ ఏడాది. దీనిపై అపరిమిత వాయిస్‌ ఆల్‌ఇండియా రోమింగ్‌, రోజుకు 2జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు. ఇప్పటికే మార్కెట్లో హవా కొనసాగిస్తున్న జియోకు పతంజలి సిమ్ ప్లాన్లు పోటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా, పతంజలి సిమ్ కార్డు కొనుగోలు చేసినవారికి రూ.2.5 లక్షల మెడికల్ ఇన్‌స్యూరెన్స్, రూ.5 లక్షల జీవిత బీమా పొందొచ్చని బాబా రామ్‌దేవ్ వెల్లడించారు. ఈ బీమా రోడ్డు ప్రమాదాలకు మాత్రమే వర్తిస్తుందని చెప్పారు.

English summary
Patanjali founder and yoga guru Baba Ramdev on Wednesday launched a new swadeshi messaging application called Kimbho to compete with WhatsApp, as reported by ANI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X