వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తగిన సాక్ష్యాధారాలు లేనందువల్ల ఈ కేసును కొట్టివేయడమైనది: సీబీఐ కోర్టు న్యాయమూర్తి వెల్లడి

|
Google Oneindia TeluguNews

లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఆరోపణలను ఎదుర్కొంటోన్న నేతలపై సీబీఐ అధికారులు సరైన సాక్ష్యాధారాలను న్యాయస్థానానికి సమర్పించలేకపోయారని న్యాయవాది వెల్లడించారు. తగిన సాక్ష్యాధారాలు లేనందు వల్ల ఈ కేసును సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసినట్లు న్యాయవాది తెలిపారు. 28 సంవత్సరాల పాటు కొనసాగిన బాబ్రీ మసీదు కూల్చివేత వ్యవహారంలో ఆరోపణలను ఎదుర్కొన్న నేతలకు వ్యతిరేకంగా సీబీఐ అధికారులు సాక్ష్యాధారాలను సేకరించలేకపోయారని చెప్పారు.

ఎల్‌కే అద్వానీ, ఉమాభారతి సహా: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సంచలన తీర్పు: హైఅలర్ట్ఎల్‌కే అద్వానీ, ఉమాభారతి సహా: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సంచలన తీర్పు: హైఅలర్ట్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. 28 సంవత్సరాల తరువాత ఈ తీర్పు వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. బాబ్రీ మసీదు కూల్చివేత ముందస్తుగా నిర్ణయించుకున్న ప్రణాళిక కాదని సీబీఐ న్యాయస్థానం వెల్లడించింది. ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటోన్న భారతీయ జనతా పార్టీ కురువృద్ధులు, మాజీ ఉప ప్రధానమంత్రి లాల్ కృష్ణ అద్వానీ, లోక్‌సభ మాజీ స్పీకర్ మురళీ మనోహర్ జోషీ, కేంద్ర మాజీమంత్రి ఉమాభారతిలపై నమోదైన కేసులను ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి సురేంద్ర కుమార్ యాదవ్ కొద్దిసేపటి కిందటే తన తుది తీర్పును వెలవడించార

Babri Masjid demolition case: Insufficient evidence, says Special Court

తీర్పు వెలువడిన అనంతరం న్యాయవాది కోర్టు వెలుపల విలేకరులతో మాట్లాడారు. కూల్చివేత కేసును కొట్టేయడానికి గల కారణాలను వివరించారు. ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి, వినయ్ కతియార్ సహా బాబ్రీ మసీదును కూల్చివేసిన ఘటనతో ప్రమేయం ఉన్న 32 మందిపై వ్యతిరేకపూరక సాక్ష్యాధారాలను సేకరించడంలో సీబీఐ అధికారులు విఫలం అయ్యారని తెలిపారు. విచారణ సందర్భంగా వారు కొన్ని డాక్యుమెంట్లను న్యాయస్థానానికి సమర్పించినప్పటికీ.. దాన్ని బలపరిచేలా ఎలాంటి అదనపు సాక్ష్యాాధారాలు అందజేయలేకపోయారని అన్నారు. దీనితో న్యాయమూర్తి ఈ కేసును కొట్టేసినట్లు చెప్పారు.

Recommended Video

Criminal cases against KCR for demolition of temple, mosques at Secretariat: Congress

1992 డిసెంబర్ 6వ తేదీ నాటి ఘటనపై నమోదైన రెండు కేసును సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సుదీర్ఘకాలం పాటు విచారించింది. ఈ సందర్భంగా మొత్తం 351 మంది సాక్ష్యులను ప్రశ్నించింది. 600 డాక్యుమెంట్లను పరిశీలించింది. అవేవీ బాబ్రీ మసీదు కూల్చివేత నేరారోపణలకు బలం కలిగించేవి కావని స్పష్టమైంది. దీనితో- న్యాయమూర్తి సురేంద్ర కుమార్ తన తుది తీర్పును వెలువరించారు. ఈ కేసును కొట్టివేశారు. ఈ కేసులో మొత్తం 49 మందిపై కూల్చివేత కేసులు నమోదు అయ్యాయి. వారిలో 17 మంది మరణించగా.. 32 మంది జీవించి ఉన్నారు. వారిలో ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, వినయ్ కతియార్, ఉమా భారతి, కల్యాణ్ సింగ్, మహంత్ నృత్యగోపాల్ దాస్ న్యాయస్థానానికి హాజరు కాలేదు. వారిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రొసీడింగ్స్‌కు హాజరయ్యారు.

English summary
The CBI Special Court on Wedesday accquited all thge 32 accused in the case over insufficent evidence. Further, the Court ruled that the videos sumbitted by the CBI were tampered with and was not admissable and that senior leaders like Advani MM Joshi tried to stop the crowd byt anti-social elements carried out the act of demolition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X