• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
LIVE

Live Updates : బాబ్రీ మసీదు కూల్చివేత కేసు: అద్వానీ సహా 32 మందికి రిలీఫ్.. నిర్దోషులుగా ప్రకటన

|

బుధవారం (సెప్టెంబర్ 30న) బాబ్రీ మసీదు కూల్చివేత కేసులపై తీర్పు వెలువడనుండటం ఉత్కంఠగా మారింది. ఎందుకంటే.. ఈ కేసులో కుట్రపూరిత నేరానికి పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో ప్రస్తుత అధికార పార్టీకి చెందిన కీలక నేతలు ఉన్నారు. బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్, బీజేపీ సీనియర్లు మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, వినయ్ కటియార్, సాక్షి మహరాజ్ సహా విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ కు చెందిన మొత్తం 32 మంది నిందితుల భవితవ్యం ఇంకొద్ది గంటల్లో తేలిపోనుంది. రెండు మతాలకు సంబంధించి ఇది సున్నితమైన కేసు కావడంతో తీర్పు వెలువడిన తర్వాత ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా చూసుకోవాలని కేంద్రం రాష్ట్రాలను అలర్ట్ చేసింది.

babri masjid demolition case live updates cbi court to pronounce verdict today

Newest First Oldest First
2:09 PM, 30 Sep
జై శ్రీరాం అంటూ ఆనందం వ్యక్తం చేసిన అద్వానీ
1:40 PM, 30 Sep
బాబ్రీ కూల్చివేతపై సీబీఐ కోర్టు తీర్పును స్వాగతించిన అద్వానీ
1:20 PM, 30 Sep
లక్నో సీబీఐ కోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది: మురళీ మనోహర్ జోషి
1:08 PM, 30 Sep
బాబ్రీ మసీదు కూల్చివేత కేసు: తీర్పును స్వాగతించిన రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్
1:05 PM, 30 Sep
అద్వానీ ఇంటికి చేరుకున్న కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్
1:00 PM, 30 Sep
చివరికీ సత్యం విజయం సాధించింది: బాబ్రీ మసీదు కూల్చివేత తీర్పుపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
12:58 PM, 30 Sep
తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన మురళి మనోహర్ జోషి. తమకు ఇన్నాళ్లకు న్యాయం జరిగిందని కామెంట్
12:49 PM, 30 Sep
లక్నో సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పును సీబీఐ హైకోర్టులో సవాల్ చేసే అవకాశం
12:42 PM, 30 Sep
నిర్దోషులుగా ప్రకటించడంతో ఊపిరి పీల్చుకున్న అద్వానీ, జోషి, ఉమాభారతి, కల్యాణ్ సింగ్
12:39 PM, 30 Sep
ముందస్తు వ్యుహాంతో.. పక్కా ప్రణాళిక ప్రకారం మసీదు కూల్చివేత జరగలేదు: జడ్జీ ఎస్కే యాదవ్
12:38 PM, 30 Sep
28 ఏళ్లుగా సాగిన బాబ్రీ మసీదు కూల్చివేత కేసు విచారణ
12:31 PM, 30 Sep
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఊరట, 32 మంది నిర్దోషులు అని జడ్జీ ప్రకటన
12:29 PM, 30 Sep
బాబ్రీ మసీదు కూల్చివేతలో మొత్తం 32 మందిని నిర్దోషులుగా ప్రకటించిన సీబీఐ కోర్టు
12:25 PM, 30 Sep
18వ నెంబ‌ర్ కోర్టులో రూమ్‌లో జడ్జీ యాదవ్
12:18 PM, 30 Sep
తీర్పు వెలువరిస్తోన్న జడ్జీ ఎస్కే యాదవ్
12:18 PM, 30 Sep
2 వేల పేజీలతో బాబ్రీ మసీదు తీర్పు కాపీ..?
12:13 PM, 30 Sep
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరైన అద్వానీ, జోషి, ఉమా భారతీ తదితరులు
11:56 AM, 30 Sep
బాబ్రీ మసీదు కూల్చివేత తీర్పు నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ
11:49 AM, 30 Sep
కోర్టుకు హాజరైన ఆరోపణలు ఎదుర్కొంటున్న రితంబర, చంపాట్ రాయ్, వినయ్ కఠియార్, బ్రిజ్ భూషణ్ శరణ్, సింగ్
11:48 AM, 30 Sep
లక్నో స్పెషల్ సీబీఐ కోర్టు వద్దకు చేరుకున్న జడ్జీ ఎస్కే యాదవ్
11:47 AM, 30 Sep
అద్వానీ, జోషి, ఉమాభారతి, కల్యాణ్ సింగ్, సతీష్ ప్రధాన్, గోపాల్ దాస్ గైర్హాజరు
11:46 AM, 30 Sep
లక్నో సీబీఐ స్పెషల్ కోర్టుకు చేరుకున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు
11:27 AM, 30 Sep
600 డాక్యుమెంట్లను సీబీఐ స్పెషల్ కోర్టుకు సమర్పించిన దర్యాప్తు సంస్థ
11:25 AM, 30 Sep
బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి తీర్పు నేపథ్యంలో సున్నితమైన ప్రాంతాల్లో బలగాల మొహరింపు
11:17 AM, 30 Sep
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఈ నెల 1వ తేదీన చివరగా వాదనలు జరిగాయి
11:06 AM, 30 Sep
వాస్తవానికి ఆగస్ట్ 22వ తేదీన తీర్పు వెలువరించాలని లక్నో సీబీఐ స్పెషల్ కోర్టును సుప్రీంకోర్టు కోరింది. కానీ తీర్పు కాపీ సిద్దం కాకపోవడంతో సెప్టెంబర్ 30వ తేదీలోపు వెల్లడించాలని పేర్కొన్నది.
11:04 AM, 30 Sep
సెప్టెంబర్ 30వ తేదీ లోపు బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసిందే.
10:59 AM, 30 Sep
సీబీఐ స్పెషల్ కోర్టు వద్ద భద్రత కట్టుదిట్టం
10:44 AM, 30 Sep
ఉమా భారతికి కరోనా వైరస్ సోకడంతో కోర్టుకు గైర్హాజరు
10:23 AM, 30 Sep
తీర్పు తనకు వ్యతిరేకంగా వచ్చినా.. బెయిల్ కోసం దరఖాస్తు చేయనంటోన్న ఉమా భారతీ
READ MORE

English summary
A special Central Bureau of Investigation (CBI) court in Lucknow will pronounce its verdict in the 1992 Babri Masjid demolition case on Wednesday. The demolition triggered some of the deadliest riots since partition and left about 2,000 dead. Here is a look at how the case has panned out
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X