వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబ్రీ కేసు: బీజేపీ నేతలకు పెద్ద ఊరట, వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపు

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ సీనియర్ నేతలు పలువురికి సీబీఐ కోర్టులో పెద్ద ఊరట లభించింది. ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, కేంద్ర మంత్రి ఉమాభారతిలకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

లక్నో: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ సీనియర్ నేతలు పలువురికి సీబీఐ కోర్టులో పెద్ద ఊరట లభించింది. కురువృద్ధ నేతలు ఎల్ కే అద్వానీ(89), మురళీ మనోహర్ జోషి(83) లతోపాటు కేంద్ర మంత్రి ఉమాభారతి(58)కి కూడా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

ఈ కేసులో అభియోగాలు నమోదు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసి, మరోవైపు వెంటనే బెయిల్ కూడా ఇచ్చిన కోర్టు తాజాగా ఇకనుంచి వ్యక్తిగతంగా సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదని పేర్కొంది.

Babri Masjid demolition case: LK Advani, Uma Bharti, MM Joshi exempted from personal appearance in CBI court

కోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలతో బీజేపీ నేతలకు పెద్ద ఊరటే లభించినట్లయింది. ఇక మీదట ప్రతిసారీ కేసు విచారణ సందర్భంగా వాయిదాలకు ఈ సీనియర్ నేతలు లక్నో వరకు రావాల్సిన అవసరం ఉండదు.

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఇంతకుముందు బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ తదితరులపై నేరపూరిత కుట్ర అభియోగాల నమోదుకు ఆదేశాలు జారీ చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు.. రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తుపై వారికి బెయిల్ కూడా మంజూరు చేసింది.

ఈ కేసులో నిందితులపై ఇప్పటికే జాతీయ సమైక్యతకు హాని కలిగించడం, ప్రార్థనా స్థలాన్ని అపవిత్రం చేయడం, ఉద్దేశపూర్వకంగా మతపరమైన భావాలను దెబ్బతీయడం, బహిరంగ అల్లర్లకు దారితీసేలా ప్రకటనలు చేయడం, అల్లర్లు చేయడం తదితర అభియోగాలు ఉన్నాయి.

వీటికి అదనంగా సీబీఐ ప్రత్యేక కోర్టు.. నేరపూరిత కుట్ర అభియోగాన్ని కూడా మోపింది. నేరం రుజువైతే నిందితులకు ఐదేళ్ల జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చని కోర్టులో ఈ కేసు విచారణను పరిశీలిస్తున్న ఓ న్యాయవాది తెలిపారు.

English summary
Senior BJP leaders LK Advani, MM Joshi and Uma Bharti were granted exemption from personal appearance by a special Central Bureau of Investigation (CBI) court on Wednesday in 1992 Babri Masjid demolition case. The trio is facing trial on conspiracy charges in connection with the Babri Masjid demolition case.Earlier last week, the special CBI court had framed criminal conspiracy charges against Advani, Joshi and Bharti for their alleged role in instigating a mob to demolish the Babri Masjid mosque in Ayodhya in 1992.Noteworthy, the fast-track court is hearing two separate cases related to the demolition of the disputed structure.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X