వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబ్రీ మసీదు కూల్చివేతపై తీర్పు: రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సెప్టెంబర్ 30న లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో ఘర్షణలు నెలకొనే అవకాశం ఉన్న సున్నితమైన జిల్లాలు, ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. తీర్పు లా అండ్ ఆర్డర్‌ పరిస్థితులపై ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది.

రామజన్మభూమి-బాబ్రీ మసీదు టైటిల్ సూట్ కేసుపై వచ్చిన సుప్రీంకోర్టు తీర్పుపై చాలా మంది ముస్లింలు అసంతృప్తితో ఉన్నారని, కూల్చివేత కేసుపై ఎలాంటి తీర్పు వస్తుందోనని ఎదురుచూస్తున్నారని ఈ అలర్ట్ ద్వారా తెలిసింది. వారికి అనుకూలంగా రాకపోతే నిరసనలు చేపట్టే అవకాశం ఉందని పేర్కొంది.

Babri Masjid demolition case verdict: States told to strengthen security in communally sensitive areas

దేశంలో సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్‌లకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసేందుకు అవకాశం కోసం కొన్ని రాడికల్స్ గ్రూప్స్ వేచి చూస్తున్నాయని, తీర్పు నేపథ్యంలో ఆందోళనలు చేసే అవకాశం ఉందని వెల్లడించింది. హిందూ సంస్థలు వారు కూడా వారికి అనుకూల తీర్పు వస్తుందని చూస్తున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని సూచింది. అలాగే, సోషల్ మీడియాపైనా దృష్టి సారించాలని పేర్కొంది.

మూడు కొత్త ఎన్ఐఏ బ్రాంచులు

Recommended Video

Priyanka Gandhi Set To Shift to Lucknow || Oneindia Telugu

హోంమంత్రిత్వ శాఖ మూడు కొత్త జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)ల శాఖలను మంజూరు చేసింది. తమిళనాడు రాష్ట్రంలో చెన్నై, మణిపూర్ రాష్ట్రంలోని ఇంఫాల్, జార్ఖండ్ రాష్ట్రంలోని రాంఛీలో ఎన్ఐఏ శాఖలు ప్రారంభమయ్యాయి.

English summary
The Centre has alerted all States to strengthen security arrangements in communally hyper-sensitive and sensitive districts to prevent possible clashes post the judgment in the Babri Masjid demolition case by a special court for CBI cases in Lucknow on September 30.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X