వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివాదాస్పద రాఫెల్ నోటు పై నోరువిప్పిన రక్షణ శాఖ మాజీ కార్యదర్శి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాఫెల్‌ అంశంలో రక్షణశాఖ ఫ్రాన్స్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతుండగానే మరోవైపు ఫ్రాన్స్ రక్షణ కార్యాలయంలోని అధికారులతో ప్రధాని కార్యాలయం సంప్రదింపులు జరిపిన విషయాన్ని ఓ ప్రముఖ దినపత్రిక బయటపెట్టడంతో లోకసభ దద్దరిల్లింది. అయితే ఈ పత్రిక మాజీ రక్షణకార్యదర్శి మోహన్ కుమార్ పేరును బహిర్గతం చేసింది. దీనిపై మోహన్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. నాడు జరిగిన సమాంతర చర్చలకు రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ధరలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

Babu behind controversial Rafale note explains why he wrote to PMO

2015 నవంబర్ 24వ తేదీన డిఫెన్స్ శాఖకు సంబంధించిన నోట్‌ను ఆంగ్ల పత్రిక బయటపెట్టింది. ఈ నోట్‌ను నాటి డిఫెన్స్ కార్యదర్శిగా ఉన్న మోహన్ కుమార్ తయారు చేశారు. రాఫెల్ పై జరుగుతున్న చర్చల్లో ప్రధాని కార్యాలయం జోక్యం చేసుకోకుంటే బాగుంటుందని.. అదే సమయంలో జోక్యం చేసుకోవడం ద్వారా రక్షణశాఖ చర్చలకు విఘాతం ఏర్పడుతోందంటూ నోట్ ప్రిపేర్ చేశారు. అయితే రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుతో దీనికి ఎలాంటి సంబంధం లేదన్నారు. నాడు రాఫెల్ చర్చల్లో ప్రధాని కార్యాలయం జోక్యం చేసుకోవడంపై రక్షణశాఖ నిరసన తెలిపిందని మోహన్ కుమార్ చెప్పారు.

అంతలోనే ఓ పత్రిక బహిర్గతం చేసిన వార్తను పట్టుకుని కాంగ్రెస్ విమర్శలకు దిగడం సరికాదన్నారు మోహన్ కుమార్. ఇదిలా ఉంటే ప్రధాని రాఫెల్ డీల్‌కు సంబంధించి రూ.30వేల కోట్ల డబ్బును తన స్నేహితుడు అనిల్ అంబానీకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాఫెల్ స్కామ్‌లో ప్రధాని మోడీ పాత్ర స్పష్టంగా ఉందని గతేడాదిగా చెబుతున్నామని చెప్పిన రాహుల్ గాంధీ... ప్రముఖ ఆంగ్లపత్రిక చేసిన ఇన్వెస్టిగేషన్‌లో కూడా ఇదే విషయం తేటతెల్లమైందని అన్నారు.

English summary
Former defence secretary G Mohan Kumar on Friday said the report over the Ministry of Defence objecting in 2015 to the PMO's "parallel negotiations" with France on the Rafale defence deal had "nothing to do with pricing". G Mohan Reddy was the defence secretary during the time of Rafale negotiations in 2015-2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X