వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైద్య రంగంలో అరుదైన సంఘటన: ఛాతి బయట గుండెతో జన్మించిన పాప

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

డింటోరీ: వైద్యరంగంలో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఛాతి బయట గుండెతో ఉన్న బేబీకి జన్మనిచ్చిన సంఘటన మధ్యప్రదేశ్‌లోని డిండోరీలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

డింటోరీకి చెందిన సుష్మ (22) అనే మహిళ బుధవారం మధ్యాహ్నాం ఛాతి బయట గుండెతో ఉన్న బేబీకు జన్మనిచ్చిందని జబల్‌పూర్‌లోని జిల్లా ఆసుపత్రిలో వైద్యుడు జీకే సమద్ వెల్లడించారు. ఈ విధంగా ఛాతి బయట గుండెతో పుట్టడాన్ని వైద్య పరిభాషలో ‘ఎక్టోపియా కార్డిక్స్' అని అంటారని తెలిపారు.

Baby girl with heart outside the chest born in Dindori

ఛాతి బయట ఉన్న గుండెతో జన్మించినా మామూలుగానే కొట్టుకుంటుందన్నారు. ఇలాగే కొనసాగితే బేబీ ఆరోగ్యానికి చాలా ప్రమాదమని తెలిపారు. బేబీకి వెంటనే ఆపరేషన్ నిర్వహించాలని అన్నారు.

ఆపరేషన్‌కు తగిన సౌకర్యాలు తమ ఆసుపత్రిలో లేకపోవడంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి పంపించామని తెలిపారు. ఛాతి బయట గుండెతో జన్మనిచ్చిన పాపను చూసేందుకు పెద్ద ఎత్తున ఆసుపత్రికి తరలివచ్చారు.

English summary
A woman today gave birth to a baby girl suffering from a rare medical condition in which the heart is located outside the chest, at the district hospital here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X