వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయ్యో పాపం: పుట్టిన బిడ్డకు కాళ్లు విరిగాయి..లివర్ నలిగింది..ఇందుకు కారణం ఎవరో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

రాజస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. అనుభవం లేని ఇద్దరు వ్యక్తులు మహిళకు డెలివరీ చేయడంతో పుట్టిన బిడ్డకు కాళ్లు విరిగిపోయాయి. అంతేకాదు లివర్ నలిగిపోయింది, మొత్తానికి శరీరం రెండు భాగాలుగా అయ్యింది. ఇంతకంటే దారణం ఏమిటంటే డెలివరీ చేసే సమయంలో ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి ఉన్నారు.

ఇక వివివరాల్లోకి వెళితే జైసల్మేర్‌లోని రామ్‌గఢ్‌లో జనవరి 6న తన భార్య దీక్షకన్వార్ నొప్పులు పడుతుండటంతో హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లాడు భర్త. అక్కడ అమృత్‌లాల్, జున్జార్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మహిళ నొప్పులు పడుతుండటంతో ఆమెకు డెలివరీ చేశారు. అయితే వారికి అనుభవం లేకపోవడం వల్ల బిడ్డ ప్రాణలకే ప్రమాదంగా మారింది. ప్రసవం సమయంలో బిడ్డను బయటకు తీసేందుకు బలం ఎక్కువగా పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో శరీరం రెండు భాగాలుగా విడిపోవడమే కాదు కాళ్లు విరిగిపోయి లివర్ నలిగిపోవడం జరిగింది. దీంతో అప్పుడే పుట్టిన బిడ్డ లోకం చూడకుండానే కానరానిలోకాలకు వెళ్లిపోయాడు.

Babys Legs fractured, Liver ruptured, during botched delivery

అప్పుడే పుట్టిన బాబు మరణించడంతో పోస్టుమార్టం కోసం తరలించారు. తన దగ్గరకు పిల్లాడి శరీరం మూడు భాగాలుగా వచ్చిందని పోస్టు మార్టం నిర్వహించిన డాక్టర్ సురేంద్ర దుగ్గర్ వెల్లడించారు. బిడ్డను బయటకు తీసే క్రమంలో బలం ఎక్కువగా ఉపయోగించడం వల్లే ఇలా జరిగి ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు డాక్టర్ సురేంద్ర. ప్రస్తుతం పోస్టు మార్టం రిపోర్టును పోలీసులకు అదించినట్లు వెల్లడించారు.

ఇక డెలివరీ చేసి బిడ్డ మృతికి కారణమైన అమృత్‌లాల్ మరియు జున్జార్‌లు డెలవరీలో శిక్షణ పొందలేదని జైసల్మేర్ ఛీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బీఎల్ బంకర్ చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం డెలివరీ చేసేందుకు అనుభవం ఉన్నవారినే ఉంచాల్సి ఉండగా అనుభవం లేని వారిని అక్కడ ఉంచారని వెల్లడించారు. ప్రస్తుతం ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రఘు శర్మకి నివేదిక అందజేసినట్లు చెప్నారు డాక్టర్ బంకర్. దీనిపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రస్తుతం అమృత్‌లాల్ మరియు జున్జార్‌లు పరారీలో ఉన్నారు. వెంటనే వారిని అరెస్టు చేయాలని మృతి చెందిన బాలుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

English summary
The baby, whose body broke into two parts, had its legs fractured and liver ruptured as the two untrained male staff at a government community health centre in Rajasthan’s Jaisalmer district attempted to deliver him, an autopsy has revealed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X