వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ: గవర్నర్ చేతిలోనే అధికారాలన్న హైకోర్టు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దేశ రాజధానిలో శాంతి భద్రతలు కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది.

పోలీసు వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీ ఉండరాదని తెలిపింది. లెఫ్టినెంట్ గవర్నర్‌ అధికారాలు, పోలీసు వ్యవస్థ నిర్వహణ తదితరాంశాలపై ఆప్ సర్కారు హైకోర్టును ఆశ్రయించింది.

Bad news for Kejriwal: Lt Governor 'administrative head' of Delhi, says HC

ఆప్ పిటిషన్‌ను గురువారం విచారించిన అనంతరం హైకోర్టు తీర్పును వెలువరించింది. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అధికారాలను తగ్గించలేమని, దేశం నలుమూలల నుంచి ఎందరో వీఐపీలు వచ్చి వెళుతుండే రాజధానిలో భద్రత కేంద్రం చేతుల్లో ఉంటేనే మంచిదని న్యాయమూర్తి తెలిపారు.

గవర్నర్ అధికారాల్లో జోక్యం చేసుకోవద్దని కేజ్రీవాల్ సర్కారుకు తేల్చి చెప్పింది. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్.. సీఎం కేజ్రీవాల్ మధ్య గత కొంతకాలంగా కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే.

కాగా, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు వెళ్లే ప్రణాళికలో ఉన్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు తెలిపాయి.

English summary
In a huge setback for the Arvind Kejriwal government, the Delhi High Court on Thursday held that the LG is the administrative head of National Capital Territory and the AAP government's contention that he is bound to act on the advice of Council of Ministers was "without substance".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X