వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రిపుల్ తలాక్ సవరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: త్రిపుల్ తలాక్ ద్వారా భార్యలకు విడాకులు ఇచ్చిన కేసులో దోషులైన పురుషులకు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేయవచ్చనే నిబంధనను బిల్లులో చేర్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ట్రిపుల్ తలాక్‌తో విడాకులు ఇవ్వడం చట్టవిరుద్ధమైన నేరంగా పరిగణిస్తూ భర్తకు మూడేళ్ల జైలు శిక్షవిధిస్తారు.

కాగా, ట్రిపుల్ తలాక్‌కు సంబంధించి బెయిల్ నిబంధన విపక్ష పార్టీల ప్రధాన డిమాండ్లలో ఒకటి కావడం గమనార్హం. తాజా సవరణ ప్రకారం తలాక్ చెప్పిన భర్తలపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయవచ్చు. కానీ, అతడు న్యాయస్థానాన్ని ఆశ్రయించి బెయిల్ పొందవచ్చు.

Bail clause amendment in Triple Talaq approved by Cabinet

ఈ చట్టం ద్వారా బాధితురాలు తనకు, మైనర్ పిల్లలకు పరిహారం కోరుతూ మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించవచ్చు. మేజిస్ట్రేట్ నిర్ణయానుసారం మైనర్ పిల్లలను తన ఆధీనంలోకి తీసుకునే వెసులుబాటు ఉంది.

ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొంది రాజ్యసభ ఆమోదం కోసం సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. తలాక్ బిల్లులో సవరణలు చేయాల్సిందిగా పలు పార్టీలు సూచించాయి. ఈ సవరణలు చేసేందుకు కేంద్రం అంగీకరించి, తాజాగా సవరణలు చేసిన బిల్లుకు ఆమోదం తెలుపుతున్నట్లు ప్రకటించింది.

English summary
The Union Cabinet on Thursday approved amendment in the Triple Talaq Bill. ANI reported that although the offence continues to remain non-bailable, but magistrate can give bail.
Read in English: Triple Talaq bill
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X