చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bakrid: త్యాగాలకు మారు పేరు బక్రీద్, దేశవ్యాప్తంగా ఘనంగా ఈద్ అల్ అదా వేడుకలు, ముస్లీంల జాగ్రత్తలు !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ బెంగళూరు/ హైదరాబాద్/ చెన్నై: ప్రపంచ వ్యాప్తంగా ముస్లీం సోదరులు బక్రీద్ (ఈద్-అల్-అదా ) పండుగను వేడుకగా జరుపుకుంటున్నారు. బక్రీద్ పండుగను ముస్లీం సోదరులు ఎంతో పవిత్రంగా, భక్తిశ్రద్దలతో నిర్వహిస్తారు. బక్రీద్ పండుగ సందర్బంగా భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన ఈద్గాలు, మసీదుల్లో ముస్లీం సోదరులు ప్రార్థనలు చేస్తున్నారు. త్యాగానితో పాటు మనోవాంఛ, అసూయ, రాగద్వేషాలు, స్వార్థం విడిచిపెట్టి మానవతను వెదజల్లాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది ముస్లీం సోదరులు బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకుంటారు. కరోనా వైరస్ వ్యాపించకుండా ముస్లీం సోదరులు అనేక జాగ్రత్తలను తీసుకుని బక్రీద్ పండుగ జరుపుకుంటున్నారు.

Lockdown: తాగిబొట్టు కదువ పెట్టిన భార్య, టీవీ కొని ఏం చేసిందంటే, తల్లిప్రేమ అంటే ఇదే, పిల్లలు!Lockdown: తాగిబొట్టు కదువ పెట్టిన భార్య, టీవీ కొని ఏం చేసిందంటే, తల్లిప్రేమ అంటే ఇదే, పిల్లలు!

 బక్రీద్ అంటేనే త్యాగాలకు మారుపేరు

బక్రీద్ అంటేనే త్యాగాలకు మారుపేరు

ఇస్లాం మత సూత్రాల ప్రకారం బక్రీద్ అంటే బకర్ ఈద్ అని అర్థం. బకర్ అంటే జంతువుని అర్థం. ఈద్ అంటే పండుగ అని అర్థం. ఖర్భాని (జంతువు)ని దానం చేసే పండుగ కాబ్బది బక్రీద్ ను ఈదుల్ ఖర్బాని అనికూడా అంటారు. ప్రతి ముస్లీం సోదరుడు బక్రీద్ పండుగ సందర్బంగా వారికి ఉన్నది ఏదో ఒకటి ఇతరులకు ఈ పండుగ సందర్బంగా దానం చెయ్యడానికి సిద్దం అవుతారు.

 మక్కాయాత్ర

మక్కాయాత్ర

ఇస్లాం మతం ప్రకారం ప్రతి ముస్లీం సోదరుడు జీవితకాలంలో ఒక్కసారైనా సౌదీ అరేబియాలోని మక్కా మదీనాకు తరలివెళ్లడాన్ని హిజ్రీగా పేర్కొంటారు. మక్కా యాత్రకు వెళ్లి మక్కాలోని మసీదులో ఉన్న కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి అక్కడ ప్రార్థనలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని ఇస్లాంమతం చెబుతోంది. ప్రపంచంలోని ముస్లీం సోదరులు అందరూ మక్కాలోని మసీదు చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసి పుణ్యం సంపాధించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. మక్కాలోని మసీదు సందర్శించడాన్ని ఖిబ్లాని అకూడా అంటారు. మక్కా మసీదును సందర్శించిన తరువాత అక్కడి నుంచి మహమ్మద్ ప్రవక్త గోరి ఉన్న మదీనా నగరాన్ని సందర్శించి అక్కడ కూడా ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.

 అల్లాహ్ ఆదేశం

అల్లాహ్ ఆదేశం

అల్లాహ్ ఆదేశాలమేరకు ఇబ్రహీం తన ఏకైక కుమారుడైన ఇస్మాయిల్ ను బలి ఇవ్వడానికి సిద్దం అవుతాడు. ఆ సాంప్రధాయాన్ని స్మరిస్తూ ముస్లీం సోదరులు ప్రతి ఏడాది బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకుంటారు. బక్రీద్ పండుగ సందర్బంగా ముస్లీం సోదరులు జంతు బలి ఇచ్చి ఆ మాంసాన్ని కుల మతాలకు అతీతంగా ఇతరులకు పంపిపెడుతారు. మాంసంతో పాటు బట్టలు, డబ్బులు, ఆహార ధాన్యాలు పేదలకు పంచిపెట్టి బక్రీద్ పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా నిర్వహించుకోవడం ముస్లీం సోదరులకు ఆనవాయితి.

Recommended Video

Bakrid Festival Real Story And Its Speciality బక్రీద్ పండగ యొక్క విశిష్టత
 కరోనా దెబ్బకు భారీ బందోబస్తు

కరోనా దెబ్బకు భారీ బందోబస్తు

భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు ముస్లీం సోదరులు అనేక జాగ్రత్తలు తీసుకుని బక్రీద్ వేడకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ముస్లీం సోదరులు మసీదులు, ఈద్గాలకు వెళ్లి ప్రార్థనలు చేస్తున్న సందర్బంగా దేశంలోని అనేక నగరాలతో పాటు అన్ని పట్టణాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న సందర్బంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పోలీసులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముస్లీం సోదరులు ఒకరిని ఒకరు అలింగనం చేసుకుని ఈద్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు.

English summary
Bakrid: Devotees arrive at Jama Masjid to offer prayers on Eid AlAdha. Temperature of devotees is also being checked with thermometer gun, as a precautionary measure to contain the spread of Coronavirus
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X