వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్జికల్ స్ట్రైక్-2 పైనా మూవీ.. బాలాకోట్! తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో..!

|
Google Oneindia TeluguNews

ముంబై: కేంద్రంలో భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తొలి హయాంలో చోటు చేసుకున్న అతి కీలక ఘట్టాలు.. సర్జికల్ స్ట్రైక్స్. మొదటిసారి 2016లో జమ్మూ కాశ్మీర్ లోని యూరి సెక్టార్ సమీపంలో పాకిస్తాన్ భూభాగంపై సర్జికల్ స్ట్రైక్ చేసింది మనదేశ సైన్యం. మెరుపుదాడులు చేసి, పాకిస్తాన్ సైన్యానికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. దేశంలోనే అందరి దృష్టినీ ఆకట్టుకున్న ఈ అంశాన్ని బాలీవుడ్ అలా ఊరకే వదిలేస్తుందా? లేదు కదా! అందుకే- సర్జికల్ స్ట్రైక్ చోటు చేసుకున్న రెండేళ్లయినప్పటికీ.. ఓ సినిమాను తీశారు. యూరి పేరుతో వచ్చిన ఆ మూవీ.. బ్లాక్ బస్టర్లలో ఒకటిగా నిలిచింది. నిర్మాతలకు కాసులపంటను పండించింది.

ప్రతీకార దాడులుగా..

అదే ఎన్డీఏ హయాంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో.. ఈ ఏడాది లోక్ సభ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు చోటు చేసుకున్న మరో సర్జికల్ స్ట్రైక్- బాలాకోట్. జమ్మూ కాశ్మీర్ లో పుల్వామా జిల్లాలోని అవంతిపుర వద్ద జైషె మహమ్మద్ ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఆత్మాహూతి దాడి చేసిన ఘటనలో 40కి పైగా జవాన్లు అమరులయ్యారు. దీనికి ప్రతీకారంగా భారత సైన్యం.. సర్జికల్ స్ట్రైక్-2ను నిర్వహించిన విషయం తెలిసిందే. జమ్మూకాశ్మీర్ లో సరిహద్దులను దాటుకుని పాకిస్తాన్ గగనతలంపైకి దూసుకెళ్లిన భారత వైమానిక దళం.. అక్కడి బాలాకోట్ లో వెలసిన జైషె మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై నిప్పులవాన కురిపించింది. ఆ శిబిరాలను నేలమట్టం చేసింది.

Balakot..Actor Vivek Oberoi is all set to back a movie of Balakot,

అభినందన్, మింటీ అగర్వాల్ కీలక పాత్రలుగా..

దీనికి సీక్వెన్స్ గా పాకిస్తాన్ సైతం మనదేశంపై వైమానిక దాడులు చేయడానికి విఫల ప్రయత్నాలు చేసింది. చేతులు కాల్చుకుంది. ఈ సందర్భంగా మనదేశ గగనతలంలోనికి చొచ్చుకుని వచ్చిన పాకిస్తాన్ యుద్ధ విమానం ఎఫ్-16ను వెంటాడుతూ వెళ్లిన వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్.. పొరపాటున ఆ దేశ భూభాగంపై దిగడం, జవాన్లు ఆయనను యుద్ధ ఖైదీగా పట్టుకోవడం చకచకా జరిగిపోయాయి. ఆ అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గిన పాకిస్తాన్.. మూడు, నాలుగురోజుల్లోనే అభినందన్ ను మనదేశానికి అప్పగించింది క్షేమంగా. తాజాగా- ఈ ఘట్టాలను కూడా బాలీవుడ్ తెరకెక్కించబోతోంది. అభినందన్ తో పాటు స్క్వాడ్రన్ లీడర్ గా తెర వెనుక సాహసోపేత నిర్ణయాలను తీసుకుంటూ వచ్చిన మింటీ అగర్వాల్ పాత్ర ఇందులో కీలకంగా మారబోతోంది.

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో..

రామ్ చరణ్ హీరోగా బోయపాటి శీను దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. బాలాకోట్ పేరుతో సినిమాను చిత్రీకరించనున్నారు. ఇదివరకు వివేక్ ఓబెరాయ్ పీఎం నరేంద్ర మోడీ అనే పేరుతో సినిమాను తీశారు. అందులో టైటిల్ రోల్ లో నటించారు. ఈ సారి బాలాకోట్ పై చిత్రీకరించే సినిమాలకు ఆయన నటించట్లేదు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఈ ఏడాదే సెట్స్ పైకి వెళ్లనుంది. జమ్మూ కాశ్మీర్, ఆగ్రా, ఢిల్లీల్లో పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాను చిత్రీకరించనున్నారు. దీనికి అవసరమైన అనుమతులు లభించినట్లు వివేక్ ఓబెరాయ్ వెల్లడించారు.

దేశ పౌరుడిగా తన బాధ్యత..

బాలాకోట్ వైమానిక దాడుల గురించి దేశ ప్రజలు తెలుసుకున్నారే గానీ.. దాని వెనుక ఉన్న సంఘటనలు తెలియవని.. వాటన్నింటినీ తెరకెక్కిస్తామని వివేక్ ఓబెరాయ్ తెలిపారు. ఓ దేశ పౌరుడిగా అది తన బాధ్యత అని ఆయన చెప్పారు. దేశ వైమానిక దళ శక్తి, సామర్థ్యాలు ఏమిటో.. బాలాకోట్ దాడులతో తేటతెల్లమైందని అన్నారు. తాను ఈ సినిమాను కమర్షియల్ పంథాలో తెరకెక్కించబోనని, లాభాలను ఆశించకుండా దేశం గురించి, వైమానిక దళ యుద్ధ శక్తిని దేశ ప్రజలకు కళ్లకు కట్టినట్టుగా తెలియజేయడానికే బాలాకోట్ పేరుతో సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలిపారు. బాలాకోట్ వైమానిక దాడుల పట్ల ప్రతి పౌరుడు గర్వ పడుతున్నారని చెప్పారు. పుల్వామా ఉగ్రవాద దాడులు చోటు చేసుకున్నప్పటి నుంచి బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ వరకు సంభవించిన ప్రతి ఘట్టాన్ని తాను ఆసక్తిగా పరిశీలించానని, ఈ సందర్భంగా కొన్ని రోమాంచక ఘట్టాలు తన దృష్టికి వచ్చాయని వివేక్ ఓబెరాయ్ తెలిపారు. వాటన్నింటినీ తాను ఈ సినిమా ద్వారా దేశ ప్రజలకు తెలియజేస్తానని అన్నారు. ఇంటెలిజెన్స్, ఆర్డ్మ్ ఫోర్సెస్ వంటి అంశాలను తెరకెక్కించడానికి నిర్మాతలు ఎందుకు సిగ్గుపడుతున్నారో తనకు తెలియట్లేదని చెప్పారు.

ఐఏఎఫ్ విశ్వసించడమే వివేక్ ఒబెరాయ్‌కు గొప్ప విజయం

ఈ సినిమా స్టోరీకి సంబంధించి తనను, తన సినిమా బృందాన్ని విశ్వసించినందుకు గాను ఐఏఎఫ్‌కు ధన్యవాదాలు చెప్పారు. ఈ సినిమాకు సరైన న్యాయం చేస్తామన్నారు. వివేక్ ఒబెరాయ్ ఈ సినిమాలో నటిస్తుండటం ఐఏఎఫ్ విశ్వాసానికి ముఖ్య కారణం. ఐఏఎఫ్ లేదా ఇతర భద్రతా బలగాల సేవలు మనసును తాకుతాయి. సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ వంటి సున్నితమైన, హైప్రొఫైల్ అంశాల్ని తెరకెక్కించాలనుకున్నప్పుడు అంతే సహజంగా తాకాలి. ప్రమాణికత లేదా ఓవర్ డ్రాటైజేషన్ ఆందోళన కలిగించే అంశాలు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం వివేక్ ఒబెరాయ్ పైన విశ్వాసం ఉంచారు. ఐఏఎఫ్ విశ్వాసాన్ని చూరగొన్న వివేక్ ఒబెరాయ్ అప్పుడే గొప్ప విజయం సాధించినట్లుగా భావించవచ్చు.

English summary
Actor Vivek Anand Oberoi is all set to back a movie that salutes the valour of the Indian Air Force (IAF). Titled Balakot, the film will be based on the Balakot air-strike, and the capture and subsequent release of IAF Wing Commander Abhinandan Varthaman — an aftermath of the Pulwama terror attack that took place in February this year. The movie will be shot in Jammu and Kashmir, Delhi and Agra, and will go on floors later this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X