వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పండగ తెచ్చిన ముప్పు: అమెజాన్, ఫ్లిప్‌కార్టులపై నిషేధం విధిస్తారా..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పండుగ సీజన్‌ సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్టులు భారీ ఫెస్టివల్ ఆఫర్స్ ప్రకటించాయి. దీంతో తమ వ్యాపారాలకు దెబ్బపడుతోందంటూ ఆ రెండు ఈ-కామర్స్ సైట్ల పై నిషేధం విధించాలంటూ భారత వాణిజ్య సంఘం ప్రభుత్వాన్ని కోరింది. అంతేకాదు ఈ రెండు సంస్థలు విదేశీ పెట్టుబడుల నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయంటూ ఫిర్యాదు చేసింది.

నిలదొక్కుకుంటుందా: భారీగా పడిపోయిన రత్నాలు, మరియు ఆభరణాల ఎగుమతులునిలదొక్కుకుంటుందా: భారీగా పడిపోయిన రత్నాలు, మరియు ఆభరణాల ఎగుమతులు

 పండగ సీజన్ సందర్భంగా భారీ ఆఫర్లు

పండగ సీజన్ సందర్భంగా భారీ ఆఫర్లు

దశరా, దీపావళి సందర్భంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు ప్రతి ఏటా భారీ డిస్కౌంట్లతో ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ సారి అక్టోబర్‌లో ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాల్‌మార్ట్ గ్రూపునకు చెందిన ఫ్లిప్‌కార్ట్ సంస్థ భారీ ఆఫర్లను సెప్టెంబర్ 29 నుంచి పెట్టనుంది. అయితే అమెజాన్ తన ఆఫర్ల తేదీలను ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఫ్యాషన్ నుంచి స్మార్ట్ ఫోన్ల వరకు భారీ ఆఫర్లు ఈ రెండు ఈ కామర్స్ సంస్థలు ప్రకటించనున్నాయి.

విదేశీ పెట్టుబడుల నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి

విదేశీ పెట్టుబడుల నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి

10శాతం నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్లు ప్రకటించడం ద్వారా అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ సంస్థలు అవే వస్తువులను అమ్మకానికి పెట్టిన ఇతర వ్యాపారస్తులను దెబ్బతీస్తున్నాయని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య ఆందోళన వ్యక్తం చేస్తోంది. అంతేకాదు మార్కెట్లో తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆరోపించింది. ఇందుకోసమే ఆ రెండు సంస్థలపై విచారణ చేయాలని ఆ రెండు కంపెనీలు విదేశీ పెట్టుబడుల నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయంటూ పేర్కొన్నారు.

Recommended Video

అమెజాన్ గిఫ్ట్ కార్డు ను అందిస్తున్న ఎయిర్‌టెల్
గతేడాది నిబంధనలను సవరించిన కేంద్రం

గతేడాది నిబంధనలను సవరించిన కేంద్రం

ఇదిలా ఉంటే గతేడాదే కేంద్ర ప్రభుత్వం ఈ-కామర్స్ నిబంధనలను మార్చింది. ఈ -కామర్స్ ఇస్తున్న భారీ ఆఫర్లతో ఇతర అసంఘటిత రీటెయిల్ రంగంకు చెందిన వ్యాపారులు ఈ-కామర్స్ వెబ్‌సైట్స్ ఇచ్చే భారీ ఆఫర్లతో పోటీ పడి ఆఫర్లు ఇవ్వలేకపోతున్నారని కేంద్రం పేర్కొంది. అంతేకాదు వీరు భారీగా నష్టపోయే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. దీంతో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థల యాజమాన్యాలు ఆలోచించి వారి స్ట్రక్చర్‌లో కొన్ని మార్పులు చేశాయి. ఇక ఈ ఆఫర్ల ద్వారా దాదాపు 5 లక్షల మంది అమ్మకందారులు వారి ఉత్పత్తులు సేల్ చేసేందుకు తమ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించుకుంటున్నారని అమెజాన్ సంస్థ పేర్కొంది. ఇక తమ సంస్థ భారత ప్రభుత్వం విధించిన నిబంధనలకు లోబడే పనిచేస్తోందని ఎక్కడా ఉల్లంఘించలేదని అమెజాన్ స్పష్టం చేసింది.

English summary
A leading Indian trader body asked the government on Friday to ban upcoming festive sales on Amazon's local unit and its rival Flipkart, saying their deep discounts violate the country's foreign investment rules for online retail.The two e-commerce firms typically hold annual festive season sales ahead of Dussehra and Diwali, which are due this year in October.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X