వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధిక్కారమా?: సుప్రీంకోర్టు ముందే టపాసులు కాల్చారు, చిన్నారులకు పంచారు..

దేశ రాజధాని ఢిల్లీలో బాణసంచా విక్రయాలను తాత్కాలికంగా నిషేధిస్తూ ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో ‘ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌’ సంస్థ సభ్యులు ఏకంగా సుప్రీంకోర్టు ముందే టపాసులు కాల్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు నిరస

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

Recommended Video

Diwali 2017 : Fire In Crackers Market : Plz Be Safe | Oneindia Telugu

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బాణసంచా విక్రయాలను తాత్కాలికంగా నిషేధిస్తూ ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో 'ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌' సంస్థ సభ్యులు ఏకంగా సుప్రీంకోర్టు ముందే టపాసులు కాల్చారు.

ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్‌)లో వచ్చేనెల 1 వరకు బాణసంచా విక్రయాలపై నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు గతవారం ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే.

సుప్రీంకోర్టు ఆదేశాలకు నిరసనలో భాగంగా న్యాయస్థానం గేటు ముందు మంగళవారం టపాసులు కాల్చిన ఘటనలో ముగ్గురు మహిళలు సహా మొత్తం 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు బీజేపీ ఢిల్లీ అధికార ప్రతినిధి తాజిందర్‌ బగ్గా పశ్చిమ ఢిల్లీలోని హరినగర్‌లో మురికివాడల చిన్నారులకు సంచులకొద్దీ టపాసులను పంచిపెట్టడం కూడా చర్చనీయాంశమైంది.

పిల్లలకు ఉచితంగా బాణసంచా పంపిణీ చేస్తున్న ఫొటోలు, వీడియోను బగ్గా స్వయంగా ట్విటర్‌లో ఉంచడం గమనార్హం. అంతేకాదు, ఈ పంపిణీ కోర్టు ధిక్కరణ కిందకు రాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. బహుమతిగా టపాసులు పంచిపెట్టడం నేరమేమీ కాదని.. బగ్గాపై చర్యలు తీసుకోబోమని ఢిల్లీ పోలీసువర్గాలు కూడా వెల్లడించాయి.

అనంతరం తాజిందర్‌ బగ్గా విలేకర్లతో మాట్లాడుతూ.. దీపావళికి ముందు టపాసుల విక్రయాలపై నిషేధం విధించడాన్ని తప్పుపట్టారు. ఈ ఆంక్షలు హిందువుల పర్వదినాన్ని లక్ష్యంగా చేసుకోవడమేనని పేర్కొన్నారు. నిషేధాన్ని ఏడాదంతా అమలు చేయాలని సూచించారు.

English summary
Members of an organisation named ‘Azad Hind Fauj’ have staged protest against Supreme Court’s order banning crackers by bursting crackers outside Supreme Court premises. “Fourteen people, including three women, have been detained by the police and were taken to the Tilak Marg police station. The members, who claimed to be from an outfit called the Azad Hind Fauj, were led by a man named Satpal Malhotra, police said”. Earlier Delhi spokesperson Tajinder Bagga has shared a video of his distributing firecrackers to slum kids in the national capital’s Hari Nagar area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X