• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ముంబై , ఢిల్లీలలో హోలీ వేడుకలపై నిషేధం..కరోనా ఎఫెక్ట్..నో సెలబ్రేషన్స్

|

దేశవ్యాప్తంగా కోవిడ్ -19 కేసులు విపరీతంగా పెరగడంతో హోలీతో పాటు రాబోయే పండుగలు , బహిరంగ వేడుకలు మరియు సమావేశాలు నిషేధించబడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీ, అలాగే మహారాష్ట్ర లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దీంతో ఢిల్లీ ,ముంబై నగరాల్లో హోలీ వేడుకలపై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

పెరుగుతున్న కేసులతో ఢిల్లీ , ముంబైలలో హోలీ వేడుకలపై నిషేధం

పెరుగుతున్న కేసులతో ఢిల్లీ , ముంబైలలో హోలీ వేడుకలపై నిషేధం

ఢిల్లీలోని ఎన్‌సిటిలో పెరుగుతున్న కోవిడ్ -19 కేసుల మధ్య, రాబోయే పండుగలైన హోలీ, నవరాత్రి మరియు సాధారణంగా సమావేశాలకు బహిరంగ వేడుకలను అనుమతించబోమని ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ పేర్కొంది. అన్ని జిల్లాల ఉన్నతాధికారులు మరియు సంబంధిత అధికారులు ఈ ఉత్తర్వులకు కట్టుబడి ఉండేలా చూడాలి అని పేర్కొంది.ముంబై లోనూ హోలీ వేడుకలు, పార్టీలు లేదా బహిరంగ ప్రదేశాలు, హోటళ్ళు మరియు రిసార్టులలో సమావేశాలను కూడా నిషేధించింది.

ఢిల్లీ ,మహారాష్ట్రలలో కరోనా పంజా .. కరోనా కట్టడికి యూపీ మార్గదర్శకాలు

ఢిల్లీ ,మహారాష్ట్రలలో కరోనా పంజా .. కరోనా కట్టడికి యూపీ మార్గదర్శకాలు

ఢిల్లీలో మంగళవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 1101 కరోనా కేసులు, నాలుగు మరణాలు నమోదయ్యాయి. మరోవైపు మహారాష్ట్ర లో ఇరవై ఎనిమిది వేలకు పైగా కేసులు పెరిగాయి. ఇక గత 24 గంటల్లో భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు రావడం నేపథ్యంలో కరోనా కట్టడి కోసం హోలీ వేడుకలను నిషేధించాలని నిర్ణయం తీసుకున్నాయి. మరోవైపు, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ సిటిజన్లు మరియు బలహీన వర్గాలను వేడుకలకు దూరంగా ఉండమని కోరుతూ మార్గదర్శకాలను జారీ చేసింది . ముందస్తు పరిపాలనా అనుమతి లేకుండా ఊరేగింపులు, సమావేశాలను అనుమతించబోమని పేర్కొంది.

సీఎం యోగీ సమీక్షా సమావేశం .. కీలక ఆదేశాలు

సీఎం యోగీ సమీక్షా సమావేశం .. కీలక ఆదేశాలు

ఇక ఉత్తరప్రదేశ్ లోనూ కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రంలోని కోవిడ్ పరిస్థితిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు యుపి ముఖ్య కార్యదర్శి ఆర్ కె తివారీ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. హోలీ పండుగ సందర్భంగా యూపీకి వచ్చే వారందరికీ కోవిడ్ పరీక్ష అవసరమని అన్ని జిల్లా, డివిజన్ స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 60 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవారిని లేదా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి అనుమతించరాదని కూడా ఆదేశాలలో పేర్కొన్నారు.

  Holi 2021 : హోలీ వేడుకలు బ్యాన్... దూరంగా ఉంటేనే మంచిది, Lockdown విధిస్తేనే Corona కంట్రోల్
  ఇతర ప్రాంతాల నుండి వచ్చే వారికి కోవిడ్ పరీక్షలు .. అలెర్ట్ అవుతున్న ప్రభుత్వాలు

  ఇతర ప్రాంతాల నుండి వచ్చే వారికి కోవిడ్ పరీక్షలు .. అలెర్ట్ అవుతున్న ప్రభుత్వాలు

  మార్చి 24 నుండి 31 వరకు ఎనిమిదో తరగతి దాకా అన్ని పాఠశాలల్లో హోలీ సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు మరియు విమానాశ్రయాలలో ప్రయాణీకులకు కోవిడ్ పరీక్షలను తప్పనిసరి చేసింది, కోవిడ్ హెల్ప్‌డెస్క్‌లను తిరిగి పనిచేసేలా చేయడం, అన్ని జిల్లాల్లో కోవిడ్ ఆసుపత్రులను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమాల్లో పాల్గొనే వ్యక్తులు సామాజిక దూరాన్ని పాటించాలని , మాస్కులు ధరించడం వంటి ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని కూడా యూపీ సర్కార్ ఆదేశించింది. ఇప్పటికే గుజరాత్ ఒరిస్సా రాష్ట్రాలలో హోలీ వేడుకలపై నిషేధం విధిస్తే తాజాగా ముంబై, ఢిల్లీలో కూడా హోలీ పై నిషేధం విధించి కరోనా కట్టడికి ప్రయత్నం చేస్తున్నాయి ప్రభుత్వాలు.

  English summary
  Public celebration and gatherings for upcoming festivals, including Holi, have been prohibited in Delhi and Mumbai amid a renewed surge in Covid-19 cases across the country.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X