వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియాలోకి అంతర్జాతీయ విమానాలపై నిషేధం.. సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు

|
Google Oneindia TeluguNews

భారదేశానికి ఇతర దేశాల నుండి షెడ్యూల్ చేసిన అంతర్జాతీయ ప్రయాణీకుల విమానాలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది భారత ఏవియేషన్ రెగ్యులేటర్ .ఈ సస్పెన్షన్‌ను సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు భారత ఏవియేషన్ రెగ్యులేటర్ డిజిసిఎ సోమవారం తెలిపింది. ఏదేమైనా, అంతర్జాతీయ షెడ్యూల్ విమానాలను నిర్దేశించిన మార్గాలలో కేస్-టు-కేస్ ప్రాతిపదికన నిర్వహించే సమర్థ అధికారం ఉందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ఒక సర్క్యులర్‌లో పేర్కొంది.

కొత్త కరోనా కేసులలో ఇండియా వరల్డ్ రికార్డ్ .. ఒకే రోజులో 80వేలకు పైగా కేసులతో తొలి దేశంగా భారత్కొత్త కరోనా కేసులలో ఇండియా వరల్డ్ రికార్డ్ .. ఒకే రోజులో 80వేలకు పైగా కేసులతో తొలి దేశంగా భారత్

కరోనావైరస్ మహమ్మారి కారణంగా షెడ్యూల్డ్ అంతర్జాతీయ ప్రయాణీకుల సేవలు మార్చి 23 నుండి భారతదేశంలో నిలిపివేయబడిన విషయం తెలిసిందే . అయినప్పటికీ ప్రత్యేక అంతర్జాతీయ విమానాలు వందే భారత్ మిషన్ క్రింద ఇతర దేశాలలో చిక్కుకున్న ఇండియన్స్ ను తీసుకురావటం కోసం నడుస్తున్నాయి. అంతర్జాతీయ ఆల్-కార్గో ఆపరేషన్లు మరియు డిజిసిఎ ప్రత్యేకంగా ఆమోదించిన విమానాల ఆపరేషన్‌ను సస్పెన్షన్ ప్రభావితం చేయదని కూడా సర్క్యులర్ తెలిపింది.

Ban on international flights into India extended till September 30 said DGCA

Recommended Video

Mumbai Pilot Built A 6 Seater Aircraft On His Rooftop || Oneindia Telugu

అన్‌లాక్‌ -4లో భాగంగా సెప్టెంబర్‌ 7వ తేదీ నుంచి పలు సామూహిక, సామాజిక పరమైన అంశాల్లో కేంద్రం ఆంక్షలు సడలించింది. మెట్రో రైళ్ల సర్వీసులు, అంతర్‌రాష్ట్ర రవాణా కొనసాగింపులు జరుగుతాయి. కానీ విమానయాన సేవల విషయంలో మాత్రం ఇంకా అంతర్జాతీయ విమానాలపై కొనసాగుతున్న సస్పెన్షన్ ఆంక్షలు సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతాయి. సెప్టెంబర్ 30 వరకు ఇతర దేశాల నుండి నడిచే అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తూ ఇండియన్ ఏవియేషన్ రెగ్యులేటర్ నిర్ణయం తీసుకుంది.

English summary
The suspension of scheduled international passenger flights has been extended till September 30, said Indian aviation regulator DGCA on Monday (August 31)."However, international scheduled flights may be allowed on selected routes by the competent authority on a case-to-case basis," noted the Directorate General of Civil Aviation (DGCA) in a circular.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X