• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నిర్ణయం తీసుకోండి లేదా నిషేధం ఎత్తివేస్తాం.. టిక్ టాక్ బ్యాన్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు

|

ఢిల్లీ : చైనీస్ యాప్ టిక్ టాక్‌పై విధించిన తాత్కాలిక నిషేధంపై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ యాప్ విషయంలో మద్రాస్ హైకోర్టు త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అలా చేయనిపక్షంలో 54 మిలియన్ల యాక్టివ్ యూజర్లున్న టిక్ టాక్‌పై నిషేధాన్ని ఎత్తివేస్తామని స్పష్టం చేసింది. యాప్ రూపకర్త అయిన చైనా కంపెనీ బైటెడెన్స్ దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు తమ వాదనలు వినకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుందని బైటెడెన్స్ తన పిటీషన్‌లో పేర్కొంది.

ఆశ్లీలత, సంస్కతి, సంప్రదాయాలను దెబ్బతీసేలా టిక్ టాక్ వీడియోలు ఉన్నందున దానిపై నిషేధం విధించాలని కొందరు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆ కోర్టు యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోవడంపై నిషేధం విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. టిక్ టాక్ యాప్‌పై పూర్తిస్థాయి నిషేధం విధించే అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి సూచించింది.

సుప్రీం చెప్పినా టిక్ టాక్ భూతం పోలే!..12 కోట్ల ఫోన్లలో ఇంకా టిక్కు టక్కుమంటూనే ఉంది..! మరెలా?

ban on tiktok app will be lifted if madras high court doesnt decide : SC

మద్రాస్ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టిక్ టాక్ యాప్ డెవలపర్ బైటెడెన్స్ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ రోజు తదుపరి విచారణ జరిపిన ధర్మాసనం టిక్ టాప్ యాప్‌ నిషేధంపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అలా చేయకపోతే బ్యాన్ ఎత్తివేస్తామని స్పష్టం చేసింది.

English summary
The Supreme Court today asked the Madras High Court to decide on its interim ban on Chinese-owned TikTok video app by Wednesday. The ban on the video app, which claims to have more than 54 million active users in India, will be lifted if the high court fails to give its decision on a plea filed by Chinese company Bytedance, which owns TikTok, the top court has said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X