వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూజర్లకు గుడ్‌న్యూస్ : టిక్ టాక్ యాప్‌ బ్యాన్ ఎత్తివేత

|
Google Oneindia TeluguNews

చెన్నై : చైనాకు చెందిన యాప్ టిక్ టాక్‌పై నిషేధం ఎత్తివేస్తూ మద్రాస్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కానీ ఆశ్లీల దృశ్యాలు అప్ లోడ్ చేయొద్దని షరతు విధించింది. టిక్ టాక్ యాప్‌తో ఆశ్లీలత ఎక్కువవుతోందని మద్రాస్ కు చెందిన అడ్వకేట్ ముత్తుకుమార్ మద్రాస్ హైకోర్టు ఆశ్రయించగా కొత్త యాప్ డౌన్ లోడ్ చేయడంపై కోర్టు నిషేధం విధిందింది. అయితే దీనిపై కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఎట్టకేలకు నిషేధాన్ని మద్రాస్ హైకోర్టు ఎత్తివేసింది.

ఆ పూచీ మాదీ : బైట్ డ్యాన్స్ కంపెనీ
దేశ భద్రత, అశ్లీల వీడియోలు యాప్ లోకి అప్ లోడ్ కాకుండా చర్యలు తీసుకుంటామని బైట్ డ్యాన్స్ మద్రాస్ హైకోర్టుకు వివరించింది. చైల్డ్ పోర్నోగ్రఫీని ఎంకరేజ్ చేయమని, 13 ఏళ్లలోపు చిన్నారులు యాప్ వినియోగించుకుండా చర్యలు చేపడుతామని హామీనివ్వడంతో మద్రాస్ హైకోర్టు ఇదివరకు విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

Ban On TikTok Video App Lifted By Madras High Court

ఎంచక్కా డౌన్ లోడ్ చేయొచ్చు ..
ఏప్రిల్ 3 మద్రాస్ హైకోర్టుకు పిటిషన్ రావడంతో కొత్త యూజర్లు యాపిల్, గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోకుండా నిషేధం విధించింది. తాజాగా షరతులతో కూడిన నిషేధం ఎత్తివేయడంతో .. కొత్త యూజర్లు కూడా టిక్ టాక్ డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంది.

English summary
The interim ban on Chinese-owned TikTok video app has been lifted by the Madras High Court, subject to certain conditions. The video app claims to have more than 54 million active users in India. Deciding the case filed by advocate Muthukumar, the bench vacated its interim order banning the app, subject to conditions that pornographic videos will not be uploaded on it, failing with the contempt of court proceedings would begin.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X