• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సునామీలా కుదిపేస్తోన్న టిక్ టాక్ వివాదం.. యువత ఎందుకిలా తయారవుతున్నారు.. నిషేధిస్తారా..?

|

టిక్‌టాక్... ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యువతను ఉర్రూతలూగిస్తోన్న యూప్. స్మార్ట్ ఫోన్ యుగంలో అరచేతిలోనే లెక్కకు మిక్కిలి ఎంటైర్ట్‌మెంట్ అందిస్తున్న యాప్. కేవలం యువతనే కాదు.. వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరికీ ఈ యాప్ చేరువైంది. అందుకే ఇంటిల్లిపాదీ టిక్‌టాక్‌లో పండగ చేసుకుంటున్నారు. సంతోషమొచ్చినా.. దు:ఖమొచ్చినా.. ఎమోషన్ ఏదైనా టిక్ టాక్‌లో తమ మూడ్‌కి అనుగుణంగా వీడియోలు చేయడం కామన్‌గా మారిపోయింది. అయితే కొన్నిసార్లు ఇవి శృతిమించుతున్నాయన్న విమర్శలు లేకపోలేదు. తాజాగా టిక్‌టాక్‌ పాపులర్ ఫైజల్ సిద్దిఖీ పోస్ట్ చేసిన ఓ వీడియో టిక్‌టాక్‌లో విమర్శల సునామీకి దారితీసింది. ఆఖరికి అది టిక్ టాక్‌పై నిషేధం డిమాండ్ చేసేంత వరకు వెళ్లింది.

అందంగా ముస్తాబై టిక్‌టాక్.. కాసేపటికే ఫ్యాన్‌కు వేలాడుతూ.. అసలేం జరిగినట్టు..?అందంగా ముస్తాబై టిక్‌టాక్.. కాసేపటికే ఫ్యాన్‌కు వేలాడుతూ.. అసలేం జరిగినట్టు..?

ఆ వీడియో రేపిన దుమారం..

ఇటీవల ఫైజల్ సిద్దిఖీ అనే ఓ పాపులర్ టిక్‌టాకర్ టిక్‌టాక్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. 'నువ్వు అతన్ని వదిలిపెడితే.. నేను వదిలిపెడుతానా..' అంటూ ఓ అమ్మాయి ముఖంపై యాసిడ్‌ పోసినట్టుగా ఆ వీడియోని రూపొందించాడు. అమ్మాయిల పట్ల హింసను ప్రోత్సహించేలా ఉన్న ఈ వీడియోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఎంటర్టైన్‌మెంట్ పేరుతో ఎలాంటి కంటెంట్‌ను ప్రమోట్ చేస్తున్నారంటూ చాలామంది ప్రముఖులు ప్రశ్నలు గుప్పించారు. కొంతమంది మరో అడుగు ముందుకేసి టిక్‌టాక్‌ను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఇందులో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు రేఖా శర్మ కూడా ఉన్నారు.

రేప్‌ను ప్రోత్సహించేలా మరో వీడియో

ఫైజల్ సిద్దిఖీ పోస్ట్ చేసిన వీడియోపై వివాదం నడుస్తుండగానే ముజిబర్ రెహమాన్ అనే మరో టిక్‌టాకర్ వీడియో వివాదాస్పదంగా మారింది. ఇందులో ఇద్దరు అబ్బాయిలు చొక్కా బటన్స్,ప్యాంట్ జిప్ పెట్టుకుంటుంటే... ఓ అమ్మాయి తన జాకెట్‌ను సరిచేసుకుంటూ ఏడుస్తుంటుంది. రేప్ కంటెంట్‌ని ప్రమోట్ చేసేలా ఉన్న ఈ వీడియోపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు టిక్‌టాక్ యాజమాన్యం ఇలాంటి కంటెంట్‌ను ఎందుకు ప్రోత్సహిస్తోంది.. వీటిని ఎందుకు మానిటర్ చేయట్లేదని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ట్విట్టర్‌లో #BanTikTok, #TikTokExposed, #TikTokDown అనే హాష్ ట్యాగ్స్‌తో టిక్ టాక్ నిషేధానికి డిమాండ్ చేస్తున్నారు.

గొంతు కలిపిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ..

జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ టిక్‌టాక్ వ్యవహారంపై ఘాటుగానే ట్వీట్ చేశారు. ' టిక్‌టాక్‌ను నిషేధించమని వాదించేవారిలో నేనూ ఒకరిని. దీన్ని నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాస్తున్నాను. అభ్యంతరకర వీడియోలే కాదు.. దీనివల్ల చాలామంది యువత కేవలం ఫాలోవర్స్‌ను పెంచుకునే పనిలో పడి అన్‌ప్రొడక్టివ్(పనీ పాట లేకుండా) మారుతున్నారని ఆమె అన్నారు. అంతేకాదు,ఫాలోవర్స్ కోసం కొంతమంది ప్రాణాలు కూడా తీసుకుంటున్నారని చెప్పారు.

నిపుణులు ఏమంటున్నారు..

నిపుణులు ఏమంటున్నారు..


పీపుల్ ఎగైనెస్ట్ రేప్స్ ఇన్ ఇండియా(PARI) ఫౌండర్ యోగిత భయాని మాట్లాడుతూ.. 'ఈ వీడియోలను చూస్తుంటే నా హృదయం రక్తమోడుతోంది. నేను అత్యాచార బాధితులతో కలిసి పనిచేశాను. వారి మనసుల్లో ఎంత ఆవేదన ఉంటుందో.. ఎంతలా కుమిలిపోతారో నాకు తెలుసు. ఆ వీడియోలోని అమ్మాయిని చూస్తుంటే మనసు కలచివేస్తోంది. అసలీ పిల్లలకు రేప్ అంటే అర్థం తెలుసా. వీరి తల్లిదండ్రులకు.. తమ పిల్లలు ఇలాంటి వీడియోలు చేస్తున్నారన్న సంగతి తెలియదని నేను 100శాతం చెప్పగలను. మరోవైపు వాళ్లు మాత్రం టిక్‌టాక్‌లో తామేదో సాధించేశామని ఫీల్ అవుతుంటారు.' అని చెప్పుకొచ్చారు.

  #IndiansAgainstTikTok : TikTok Rating Drops In Google Play Store
   ఖండిస్తున్న నటీనటులు..

  ఖండిస్తున్న నటీనటులు..

  ప్రముఖ నటి శిల్పా శెట్టి కుంద్రా కూడా టిక్ టాక్‌లో వస్తున్న ఇలాంటి వీడియోలను ఖండించారు. టిక్ టాక్‌కి సంబంధించి స్ట్రిక్ట్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉన్నాయని.. ప్రతీ టిక్ టాకర్ వాటిని పాటించాలని అన్నారు. చపాక్ సినిమా దర్శకుడు,నటుడు విక్రాంత్ మాసే మాట్లాడుతూ.. 'ఇలాంటి వారికి కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కేవలం వారి టిక్ టాక్ ఖాతాలను తొలగించడం ద్వారా,ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయడం ద్వారా ఎటువంటి ప్రయోజనం ఉండదు. కేవలం సమస్యను ఉపరితలంపై చూడటం కాకుండా.. దాని మూలాలపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది.' అని స్పష్టం చేశారు.

  English summary
  Just a day after TikToker Faizal Siddiqui’s account was removed following a video showing him throwing liquid (suggesting acid) on a girl’s face who refused his advances, another repulsive video surfaced on the platform — this time advocating rape. It shows TikToker Mujibur Rehman and his friend, zipping up their pants as the girl sobs and adjusts her clothes.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X