వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

థ్యాంక్యూ చంద్ర‌బాబూ! మ‌మ‌తా దీదీ మ‌మ‌కారం

|
Google Oneindia TeluguNews

కోల్‌క‌త‌: కేంద్ర ప్ర‌భుత్వం క‌క్ష క‌ట్టిందో, ఏమో గానీ కొన్ని నెల‌లుగా తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీకి ఏదీ క‌లిసి రావట్లేదు. దేశంలో ఎన్నిక‌ల వేడి రాజుకున్న‌ప్ప‌టి నుంచీ ఆమెకు సెగ పెడుతూనే వ‌స్తోంది కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తాపార్టీ. కార‌ణాలేమైన‌ప్ప‌టికీ- మ‌మ‌తా దీదీ ప్ర‌భుత్వాన్ని టార్గెట్‌గా చేసుకుంది కేంద్ర ప్ర‌భుత్వం. మొద‌ట్లో సీబీఐ దాడులు, ఆ త‌రువాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ అధికారుల సోదాలు వెంట‌వెంట‌నే చోటు చేసుకున్నాయి. వాటిని త‌ట్టుకుని, కేంద్రాన్ని ఢీ కొట్టి నిలిచారు మ‌మ‌తా బెన‌ర్జీ. ఇక‌- ఎన్నిక‌ల షెడ్యూల్ వెలువ‌డే నాటికి ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వంపై దాడులు తీవ్ర‌త‌రం అయ్యాయి.

ప‌శ్చిమ బెంగాల్‌పై ప‌ట్టు సాధిస్తే.. అవ‌లీల‌గా కేంద్రంలో అధికారాన్ని అందుకోవ‌చ్చ‌నేది బీజేపీ నేత వ్యూహం. అయిదా? ప‌దా? 42 లోక్‌స‌భ స్థానాలు. వాటిల్లో మెజారిటీ స్థానాల‌ను కొట్ట‌గ‌లిగితే - చాల‌నే అభిప్రాయంలో ఉంది బీజేపీ అగ్ర నాయ‌క‌త్వం. న‌రేంద్ర మోడీ హ‌వా భ‌యంక‌రంగా వీచిన 2014లో కూడా ప‌శ్చిమ బెంగాల్‌లో బీజేపీ చ‌తికిల ప‌డింది.

Banerjee over West Bengal campaign ban, Didi says thanks

42 స్థానాల‌కు ఆ పార్టీ ద‌క్కించుకున్న‌ది రెండే. అందుకే- 2019 ఎన్నిక‌ల్లో ఎలాగైనా ప‌శ్చిమ బెంగాల్‌లో పాగా వేయడానికి ప్ర‌య‌త్నాలు సాగిస్తోంది. అందులో భాగంగా- మ‌మ‌తా బెనర్జీని ఇక్క‌ట్ల‌కు గురి చేస్తోంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మౌతోంది. ఈ ప‌రిస్థితుల్లో మ‌మ‌తా బెన‌ర్జీ నిత్య పోరాటాల‌ను ఎదుర్కొన్నార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

తాజాగా అమిత్ షా రోడ్ షో సంద‌ర్భంగా చెల‌రేగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు కూడా మ‌మ‌తా బెన‌ర్జీని ఇరుకున పెట్ట‌డానికే అంటూ బీజేపీయేత‌ర రాజ‌కీయ పార్టీలు మండి ప‌డుతున్నాయి. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సైతం బీజేపీని దుయ్య‌బ‌ట్టారు. చంద్ర‌బాబు, మాయావ‌తి, అఖిలేష్ యాద‌వ్ వంటి బీజేపీయేత‌ర పార్టీలు మ‌మతా బెన‌ర్జీకి అండ‌గా నిలిచారు. చంద్ర‌బాబు నాయుడు నాలుగు సార్లు కోల్‌క‌త వెళ్లి మ‌రీ.. మ‌మ‌తా దీదీని ప‌ల‌క‌రించి వ‌చ్చారు. ఇలాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో త‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చినందుకు మ‌మ‌తా బెన‌ర్జీ వారంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ఈ మేరకు గురువారం ఆమె ఓ ట్వీట్ చేశారు.

English summary
An united Opposition has emerged in support of West Bengal Chief Minister Mamata Banerjee after the Election Commission cut short campaigning in the state in aftermath of clashes between Trinamool Congress and Bharatiya Janata Party workers. Regional political stalwarts, including Bahujan Samaj Party (BSP) chief Mayawati, Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu, Aam Aadmi Party (AAP) chief Arvind Kejriwal, and Congress leaders slammed the Election Commission for its decision to cut short the poll campaign duration in West Bengal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X