వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిద్దూ వద్దూ: బెంగళూరు అపార్ట్‌మెంట్ నివాసుల నిరసన, ఎన్ని పన్నులు దేవుడా!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగరంలోని అపార్ట్ మెంట్ల మీద జలమండలి చూపిస్తున్న తారతమ్యానికి వ్యతిరేకంగా బెంగళూరు అపార్ట్ మెంట్ ఫెడరేషన్ (ఫోరం) శనివారం నిరసన వ్యక్తం చేసింది. బెంగళూరు నగరంలోని అనేక ప్రాంతాల్లో రోడ్ల పక్కన మౌనంగా అపార్ట్ మెంట్ లలో నివాసం ఉంటున్న వారు కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా నిర్వహించారు. బెంగళూరు జలమండలి తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలలని డిమాండ్ చేశారు.

ఇప్పటికే అనేక పన్నులు బాదేశారు !

ఇప్పటికే అనేక పన్నులు బాదేశారు !

బెంగళూరులోని అపార్ట్ మెంట్లలో నివాసం ఉంటున్న వారు ఇప్పటికే ఆస్తి పన్ను, వాటర్ బిల్, విద్యుత్ బిల్, చెత్త సేకరించడానికి పన్ను తదితర వాటికి భారీ మొత్తంలో పన్ను చెల్లిస్తున్నామని, ఇప్పుడు బెంగళూరు జలమండలి డబుల్ పైపింగ్ సిస్టమ్, ఎస్ టీపీ (మురికి నీటి శుద్ది కేంద్రం) పేరుతో వేధింపులకు గురి చేస్తుందని ఆరోపిస్తున్నారు.

ఒకే సారి 300 శాతం పన్ను !

ఒకే సారి 300 శాతం పన్ను !

అపార్ట్ మెంట్ లలో నివాసం ఉంటున్న వారు ఎక్కువగా నీరు ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తూ మూడు సంవత్సరాల క్రితం నీటి బిల్లు ఒకే సారి 300 శాతం పెంచారని, అప్పుడు తాము వ్యతిరేకించినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదని, ఇప్పుడు డబుల్ పైపింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని జలమండలి వేధింపులకు గురి చేస్తుందని అపార్ట్ మెంట్ నివాసులు ఆరోపిస్తున్నారు.

ఆన్ లైన్ లో సంతకాల సేకరణ

ఆన్ లైన్ లో సంతకాల సేకరణ

బెంగళూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో అపార్ట్ మెంట్లలో నివాసం ఉంటున్న వారి నుంచి ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆన్ లైన్ లో సంతకాల సేకరణ చేపట్టారు. జలమండలి నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేసి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఇవ్వాలని బెంగళూరు అపార్ట్ మెంట్ నివాసుల ఫెడరేషన్ నిర్ణయించింది.

ఈ పన్నులు ఉద్దూ, అపార్ట్ మెంట్లు ఉద్దు

ఈ పన్నులు ఉద్దూ, అపార్ట్ మెంట్లు ఉద్దు

కర్ణాటక ప్రభుత్వ తీరుతో తాము విసిగిపోతున్నామని బెంగళూరు అపార్ట్ మెంట్ నివాసుల ఫెడరేషన్ సభ్యలు అంటున్నారు. సొంత అపార్ట్ మెంట్లలో ఉన్నామని చిన్న తృప్తి తప్పా మాకు అంతా అసంతృప్తిగానే ఉందని, అనేక విధాలుగా పన్నులు చెల్లించి విసిగిపోతున్నామని, ఒక్కోసారి ఈ అపార్ట్ మెంట్లు ఉద్దు దేవుడా అనిపిస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

మమ్మల్ని వదిలేయండి !

మమ్మల్ని వదిలేయండి !

బెంగళూరు జలమండలి తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికే నిర్మించిన అపార్ట్ మెంట్లకు మినాహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నగరంలోని అపార్ట్ మెంట్లలో నివాసం ఉంటున్న వారు డిమాండ్ చేశారు. కొత్తగా నిర్మించే అపార్ట్ మెంట్లకు బెంగళూరు జలమండలి కొత్త నియమాలు అమలు అయ్యేల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి మనవి చేశారు.

బెంగళూరు మొత్తం నిరసనలు

బెంగళూరు మొత్తం నిరసనలు


బెంగళూరు నగరంలోని జయనగర, జేపీ నగర్, హెచ్ఎస్ఆర్ లేఔట్, మారతహళ్ళి, హెచ్ఏఎల్, వైట్ ఫీల్డ్, టిన్ ఫ్యాక్టరీ, పాత మద్రాసు రోడ్డు, హెచ్ఏఎల్, మల్లేశ్వరం, రాజాజీనగర, యశవంతపురం, యలహంక, బెంగళూరు- బళ్లారి రహదారి, హెబ్బాళ, రింగ్ రోడ్డు, బాణసవాడి తదితర ప్రాంతాల్లో అపార్టమెంట్లలో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యులు శనివారం ఉదయం 9.30 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు రోడ్లు పక్కన నిలబడి నిరసన వ్యక్తం చేశారు.

English summary
Bangalore Appartments Forum conducting a peaceful and silent protest on the Govt order of installing STPs with retrospective effect, without consideration of structural integrity and strength of the buildings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X