బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుడ్ న్యూస్: బెంగళూరులో హెలికాప్టర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం: ఫుల్ హ్యాపీ, జస్ట్ 15 ని.మి!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Helicopter taxi service : Finally, a solution to Bengaluru's traffic

బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హోసూరు రోడ్డులోని ఎలక్ట్రానిక్ సిటీకి హెలికాప్టర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం అయ్యాయి. మార్చి 5వ తేదీ సోమవారం ఎలక్ట్రానిక్ సిటీ నుంచి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మొదటి హెలికాప్టర్ ట్యాక్సీలు విహరించింది. తరువాత మరో హెలికాప్టర్ రెండు ప్రాంతాలకు సంచరించింది. ప్రస్తుతం రెండు హెలికాప్టర్ ట్యాక్సీ సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చారు.

తుంబి ఏవియేషన్

తుంబి ఏవియేషన్

కేరళలోని కొచ్చికి చెందిన తుంబి ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బెంగళూరులో హెలికాప్టర్ ట్యాక్సీ సేవలకు శ్రీకారం చుట్టింది. హెలికాప్టర్ ట్యాక్సీ సర్వీసులకు ఇప్పటికే మంచి డిమాండ్ ఏర్పడిందని, త్వరలో మరన్ని ప్రాంతాల నుంచి హెలికాప్టర్ ట్యాక్సీ సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని తుంబి ఏవియేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ క్యాప్టెన్ కేఎన్ జీ. నాయర్ తనను కలిసిన మీడియాకు చెప్పారు.

టైంటేబుల్ , బెల్ 407

టైంటేబుల్ , బెల్ 407

బెల్ 407 హెలికాప్టర్ టాక్సీ సేవలు బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం- ఎలక్ట్రానిక్ సిటీ- హెచ్ఏఎల్ మార్గాల్లో సంచరిస్తున్నాయి. ప్రతి రోజు ఉదయం 6.30 నుంచి ఉదయం 9.30 గంటల వరకు, మద్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు బెల్ 407 కంపెనీకి చెందిన రెండు హెలికాప్టర్ ట్యాక్సీలు సంచరిస్తున్నాయి.

టిక్కెట్ ధర ఫిక్స్

టిక్కెట్ ధర ఫిక్స్

బెంగళూరులో హెలికాప్టర్ ట్యాక్సీలో సంచరించే ప్రతి ప్రతిప్రయాణికుడు టిక్కెట్ ధర రూ. 4,100 (రూ. 3,500+జీఎస్ టీ) చెల్లించాలి. ప్రయాణికులతో పాటు 15 కేజీల లగేజీని హెలికాప్టర్ ట్యాక్సీలో తరలించడానికి అవకాశం కల్పించారు.

బెంగళూరు ట్రాఫిక్ తో రిలాక్స్

బెంగళూరు ట్రాఫిక్ తో రిలాక్స్

బెంగళూరులో నిత్యం ట్రాఫిక్ సమస్యలతో కొన్ని గంటల ముందు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరకు బయలుదేరే విమాన ప్రయాణికులు ఇక ముందు ఆ సమస్య నుంచి తప్పించుకోవడానికి చక్కటి అవకాశం వచ్చింది. ఎలక్ట్రానిక్ సిటీ నుంచి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సోమవారం కేవలం 15 నిమిషాల్లో చేరుకున్న ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు.

ధర రెట్టింపు అయినా !

ధర రెట్టింపు అయినా !

బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ నుంచి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రం దగ్గరకు లగ్జీరీ ట్యాక్సీ కార్లలో ప్రయాణించడానికి రూ. 1,500 నుంచి రూ. 2,500 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉండటంతో క్యాబ్ ధరల కంటే రెండింతలు ఎక్కవ హెలికాప్టర్ ట్యాక్సీలకు చెల్లించడానికి ప్రయాణికులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది హెలికాప్టర్ ట్యాక్సీలలో వారి సీట్లు బుక్ చేసుకున్నారు.

English summary
Bengaluru's Helicopter taxi service is all set to take off on Monday with users able to fly from Kempegowda International Airport to Electronic city in 15 minutes, a journey that usually takes two hours by road.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X