బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి టాగూర్ సినిమా సీన్ రిపీట్! చనిపోయిన వ్యక్తికి వైద్యం

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాలో డబ్బు కోసం కార్పోరేట్ ఆసుపత్రిలో మృతదేహానికి వైద్యం చేసిన సీన్ బెంగళూరులో రిపీట్ అయింది! నగరంలో హెచ్1ఎన్1 వ్యాధితో మరణించిన వ్యక్తికి చికిత్స చేసినట్లుగా చెప్పి ఆంబులెన్స్‌లో వేరే ఆసుపత్రికి తరలించినట్లు చెప్పి, చివరికి పేషంట్ మృతి చెందాడని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ శివార్లలోని చింతామణి (కర్ణాటక)లో నివాసం ఉంటున్న నాగరాజు (43)కు వారం క్రితం హెచ్ 1 ఎన్ 1వ్యాధి సోకింది. అతను బెంగళూరులోని కేఆర్ పురం సమీపంలోని రామమూర్తి నగరలోని ఓ ఆసత్రిలో ఐసీయులో చికిత్స పోందుతున్నాడు.

ప్రతి రోజు 30 వేల వరకు డబ్బు ఖర్చ చేశామని నాగరాజు కుటుంబ సభ్యులు అంటున్నారు. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఆసుపత్రి వైద్యులు నాగరాజు కుటుంబ సభ్యులను పిలిపించారు. నాగరాజుకు మెరుగైన చికిత్స అందించాలని వెంటనే రాజీవ్ గాంధీ ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని చెప్పారు.

bangalore hospital H1 N1 case

108 ఆంబులెన్స్‌లో నాగరాజుకు వెంటిలేర్ పెట్టి రాజీవ్ గాంధీ ( ప్రభుత్వ ఆసుపత్రి)కి తీసుకు వెళ్లారు. అక్కడి ఆసుపత్రి వైద్యులు నాగరాజుకు వైద్య పరీక్షలు చేశారు. నాగరాజు ఎప్పుడో మరణించాడని కుటుంబ సభ్యులకు చెప్పారు. తరువాత డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు.

నాగరాజ్ మంగళవారం మరణించాడని రాజీవ్ గాంధీ ఆసుపత్రి వైద్యులు చెప్పారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డబ్బు కోసం రెండు రోజులు వీరు శవానికి వైద్య పరీక్షలు చేసినట్లు నటించారని మండిపడ్డారు. నాగరాజుమృతదేహాం ఆసుపత్రి ముందు పెట్టి నిరసన వ్యక్తం చేశారు.

హెచ్1ఎన్1 వ్యాధితో బాధపడుతున్న నాగరాజకు తాము మెరుగైన చికిత్స అందించామని, బుధవారం మద్యాహ్నం వరకు నాగరాజు బ్రతికే ఉన్నాడని ఆ ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.

విషయం తెలుసున్న బీబీఎంపీ ఆరోగ్య శాఖ అధికారులు ఆసుపత్రికి చేరుకుని అక్కడి వైద్యులను విచారణ చేసి వివరాలు సేకరించారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నాగరాజు మృతదేహాన్ని పరిశీలించి వైద్య నివేదిక ఇచ్చిన తర్వాత అతను ఎప్పుడు మరణించాడు అని తెలుస్తుందని బీబీఎంపీ అధికారులు తెలిపారు.

English summary
bangalore hospital H1 N1 case
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X